ఆరడుగుల అందగాడు, టాలీవుడ్ ప్రేక్షకుల డార్లింగ్ ప్రభాస్ ను ఇష్టపడని వ్యక్తులు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరినీ నొప్పించకుండా వివాదాలకు దూరంగా ఉండే హీరో ప్రభాస్ ఒక టాప్ డైరెక్టర్ కు ఇచ్చిన మాటకోసం మరో టాప్ డైరెక్టర్ ను బాధపెట్టిన సంఘటన బయటకు వచ్చింది. మొన్న భాగ్యనగరంలో జరిగిన ‘సత్య-2’ ఆడియో వేడుకకు ప్రభాస్ ను ముఖ్య అతిధిగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఆహ్వానించాడట. రామ్ గోపాల్ వర్మ, హీరో ప్రభాస్ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడమే కాకుండా వారిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటారు.

ఈ సాన్నిహిత్యం తో ప్రభాస్ కూడా తాను ఆ ఫంక్షన్ కు వస్తానని వర్మ కు మాట ఇచ్చాడట. చివరి నిమిషం వరకూ సత్య-2 ఆడియో వేడుకకు వస్తాడు అనుకున్న ప్రభాస్ ఆఖరి నిమిషంలో తాను ఆడియో వేడుకకు రాలేకపోతున్నాను అని వర్మ కు మెసెజ్ ఇవ్వడంతో రామ్ గోపాల్ వర్మ షాక్ అవ్వడమే కాకుండా ప్రభాస్ పై చాలా కోపాన్ని కూడా తెచ్చుకున్నాడట. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ ఫంక్షన్ కు రాకపోవడానికి కల కారణం టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అని అంటున్నారు. ప్రభాస్ ‘బాహుబలి’ కోసం రూపొందించుకున్న లుక్ తో తరచూ పబ్లిక్ ఫంక్షన్స్ లో కనబడుతూ ఉంటే ఆ లుక్ కు క్రేజ్ పోతుందని, అందుకే ఎట్టి పరిస్థితులలోనూ సత్య-2 ఆడియో వేడుకకు వెళ్ళవద్దని రాజమౌళి చెప్పడంతో విధిలేక రామ్ గోపాల్ వర్మ కు హ్యాండ్ ఇచ్చాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

గతంలో కూడా ప్రియమణి-కృష్ణంరాజు లు నటించిన ‘చండీ’ ఆడియో వేడుకకు కూడా కృష్ణంరాజు పిలిచినా ప్రభాస్ ఇలాగే ప్రవర్తించాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే దర్శకుడు రాజమౌళి ప్రభాస్ ను పెళ్ళికి దూరం చేయడమే కాకుండా తన సన్నిహితులకు కూడా బాహుబలి సినిమా వల్ల దూరం చేస్తున్నాడు అనుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: