పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా గాంధీ జయంతి నాడు విడుదల అవుతుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈరోజు ఫిల్మ్ నగర్ లో మరో షాకింగ్ న్యూస్ బాంబ్ లా పేలింది. వినపడుతున్న ఈ మాటలు నిజాలు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు వెర్రెత్తి పోవడం ఖాయం. ఇప్పటి వరకూ సమైఖ్య ఉద్యమ సెగల వల్ల ఈ సినిమా విడుదల తరచూ వాయిదా పడుతోంది అనే వార్తలు తరచూ వినిపించాయి. కాని ఈ వార్తలు ఏవి నిజాలు కావట. అసలు నిజం వేరు అంటూ వార్తలు వస్తున్నాయి.

మొట్టమొదట ఈ సినిమా ఆగష్టు 8 న విడుదల కు సిద్ధం అవుతున్న సమయంలో ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ ను చూసి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన బయ్యర్లు ఈ సినిమాకు మంచి ఫాన్సీ రేట్ ను కోట్ చేసి అడ్వాన్స్ లు కూడా ఇచ్చి ఈ సినిమా హక్కులను జిల్లాల వారీగా పొందారట. అయితే ఆ తరువాత రాష్ట్రంలో పరిస్థితులు తారుమారు కావడం, సమైఖ్య సెగలు ఈ సినిమాకు తాకడం తో పాటు అసలు ఈ సినిమా విడుదల దారి ఎప్పుడో తెలియని పరిస్థితులు ఏర్పడడం తో పాటు ఇంత ఆలస్యంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే ఈ సినిమా అనుకున్న విధంగా హిట్ అవుతుందా..? అనే అనుమానం బయ్యర్లకు రావడంతో ప్రస్తుతం అక్టోబర్ 2 న ఈ సినిమాను విడుదల చేద్దామని ప్రయత్నిస్తున్న ఈ సినిమా నిర్మాత ప్రసాద్ వద్దకు వెళ్లి, ఈ సినిమా కు సంబంధించి బయ్యర్లు కోట్ చేసిన మొత్తాలలో 20- 30 శాతం వరకూ తగ్గించమని, లేకుంటే ఈ డీల్ ను వదిలివేసుకుంటామని చెపుతున్నారట.

దీనితో షాక్ కు గురి అయిన ప్రసాద్ రేట్ ఎలా తగ్గిస్తాము అని ప్రశ్నిస్తూ ఉంటే, సినిమా విడుదల అయి రిజల్ట్ వచ్చిన తరువాత అయితే గతంలో తాము ఒప్పుకున్న రేట్ అని, లేకుంటే ముందుగానే పేమెంట్స్ ఇవ్వాలి అంటే నిర్మాత 20-30 శాతం అనుకున్న రేట్ లో తగ్గించవలసిందేనని పట్టు బడుతున్నారట. బయ్యర్లు చేస్తున్న ఈ కొత్త కండిషన్స్ వల్ల ‘అత్తారింటికి దారేది’ అక్టోబర్ లో కూడా రావడం కుదరకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ కొత్త బయ్యర్లను వెతుకుదాము అని నిర్మాత ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఎవరూ ముందుకు రారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో పవన్ అత్తారిల్లు తిరగబడింది అంటూ ఫిల్మ్ నగర్ లో సెటైర్లు పడుతున్నాయి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: