అందరినీ హర్ట్ చేయడం తప్ప వర్మ ఎందుకు హర్ట్ అవుతాడు అంటారా! అవుతాడులెండి... అతడూ మనిషేగా. ఎంత దెయ్యాలతోనూ, క్రిమినల్స్ తోనూ సినిమాలు చేస్తే మాత్రం ఫీలింగ్స్ లేకుండా పోతాయా ఏంటి! అయితే ఈ విషయం వినగానే ఎందుకు హర్ట్ అయ్యాడు అని ఎవరూ అడగరు, అతడిని ఎవరు హర్ట్ చేశారు అని అడుగుతారు. ఎందుకంటే, అన్నీ లైట్ తీసుకునే వర్మని హర్ట్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో కాదు... ప్రభాస్.

ఎందుకో తెలీదు కానీ... ఈ మధ్య ప్రభాస్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు వర్మ. మరి ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడో లేక స్నేహమే చేయాలనుకుంఉటన్నాడో తెలీదు కానీ... తరచుగా అతడితో మాట్లాడుతూనే ఉంటున్నాడని సమాచారం. ఆ చనువుతోనే సత్య 2 ఆడియో విడుదల వేడుకకు చీఫ్ గెస్టుగా రమ్మని ఆహ్వానించాడు ఛత్రపతిని. అతడు కూడా వస్తానని మాటిచ్చేశాడు. తీరా సమయం వచ్చాక హ్యాండిచ్చాడు. కనీసం రాలేకపోతున్నానని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడట. దాంతో ఎప్పుడూ లేనిది వర్మ చాలా నిరాశ పడ్డాడని అతడి సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ప్రభాస్ చేసిన పని కరెక్ట్ కాదని, అతడిలా చేసి ఉండకూడదని వర్మ వాపోయాడని తెలుస్తోంది.

వర్మ ఫీలవడంలో తప్పేమీ లేదు. రానప్పుడు రాలేనని చెప్పాలి గానీ అలా మాటిచ్చెయ్యడమేంటి! అయినా బాహుబలి సినిమా అయ్యవరకూ ఎక్కడికీ వెళ్లొద్దని, నీ గెటప్ గురించి అందరికీ తెలిసిపోయి సర్ ప్రయిజ్ పోతుందని రాజమౌళి ముందే కండిషన్ పెట్టాడట ప్రభాస్ కి. అలాంటప్పుడు వర్మకి ఎందుకు మాటిచ్చినట్టు! అందుకే పాపం వర్మ హర్ట్ అయి ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: