అరవీర భయంకరుడు గోన గన్నారెడ్డిగా ప్రిన్స్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకులను  అదరగొట్టేందుకు సిద్దమవుతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది, ముందుగా దీనికి మహేష్ నో చెప్పినప్పటికి ఆయనను సదరు సినిమా దర్శకుడు వదలకపోతుండడంతో చివరకు మహేష్ ఓకే చెప్పినట్టు సమాచారం. అందుకే ఆయన కోసం గోనాగన్నారెడ్డి కాస్ట్యూమ్స్ కూడా వేగంగా తయారవుతున్నాయంటున్నారు.

అనుష్క ప్రధాన పాత్రగా రుద్రమదేవి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్యే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు జరుపుకుంది కూడా. త్వరలో రెండో షెడ్యూల్ కూడా ఇదే స్టూడియోలో జరుపుకోనుందట.

గుణశేఖర్ కు మహేష్ బాబుకు మద్య మంచి స్నేహబందం ఉందన్నది అందరికి తెలుసు, రుద్రమదేవిలో అదరగొట్టే ఓ వీరుడుగా గొనా గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ వెంట పడుతూనే ఉన్నాడు గుణశేఖర్ అన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పాత్ర కావడం, స్నేహితుని పోరు కూడా ఎక్కువ కావడంలో ఊహూ.. అనకుండా ఊ.. అన్నాడట మహేష్ బాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: