ఎప్పుడు స్టైలిష్ గా, చలాకీగా ఏదో ఒకటి చేస్తూ టాలీవుడ్ టాక్ లో ఉండే బన్నీ(అల్లు అర్జున్) షాక్ కు గురయ్యాడు అంటున్నారు సినిమావాళ్లు. కారణం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఆయన తెరపైకి వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా హిట్టుకాకపోవడం, పైగా బన్నీ లుకింగ్, పర్ ఫార్మెన్స్ కూడా బాగా లేదని టాక్ రావడంతో షాక్ కు గురయ్యాడు అంటున్నారు ఆయన సన్నిహితులు.

అందుకే ఎవరితోను మాట్లాడకుండా, ఏఫంక్షన్లలోను కనిపించి హల్ చల్ చేయకుండా సైలెంట్ గా ఉంటున్నాడట. ఈ షాక్ నుంచి కోలుకోవడాని ‘రేసు గుర్రం’ సినిమా పై పూర్తి గా శ్రద్ద పెట్టాడు అంటున్నారు. సురేందర్ రెడ్డి నైపుణ్యంతో  వస్తున్న ఇది విడుదలయి, బంపర్ హిట్టుకొడితే కాని ఇద్దరమ్మాయిల షాక్ నుంచి బన్నీ కోలుకోడు అంటున్నారు ఆయన సన్నిహితులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: