అందరు అనుకుంటున్నట్టుగానే జరగబోతోంది, ఇన్నాళ్లు అబ్బే అలా చేయరు, పరువుతో పాటు డబ్బు నష్టం కూడా జరుగుతుంది కదా... అని భావించిన వారి అభిమానులకు ఎట్టకేలకు టెన్షన్ పుట్టించారు. నిన్నటి దాకి వారి సినిమాల విడుదలకు వారం రోజుల వ్యవధి ఉంటుందనుకున్నారు. కాని అలాంటిది కూడా లేకుండా ఒక్క రోజుతేడాతోనే విడుదల చేస్తున్నట్టు నిర్ణయించారట.

అంటే బాక్సాఫీసు వద్ద జూనియర్, పవన్ కళ్యాణ్ కొట్టుకోనున్నారన్న మాట. ఈ పరిస్తితి టాలీవుడ్ లో ఇద్దరు అగ్రహీరోలకు ఎదురుకావడం ఈ మద్య కాలంలో ఇదే మొదటి సారి అంటున్నారు. ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విడుదల తేదీని అక్టోబరు పదో తేదీని ఖరారు చేసుకుంది. అలాగే పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల తేది అక్టోబరు పదో తేదీని ఖరారు చేసుకుంది.

దీంతో సినిమా థియేటర్లను కూడా ఎలా పంచుకుంటారనేది కూడా టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పైగా రాజకీయ పరిస్థితులు మాత్రం ఇద్దరి విషయంలో విభిన్నంగా ఉన్నాయి. చిరంజీవి రాజీనామా చేయకపోవడంతో పవన్ సినిమాలపై సీమాంద్రలో బెదిరింపులు వస్తుండగా, తండ్రి హరిక్రిష్ణ సమైక్యాంధ్ర అనడంతో ఎన్టీఆర్ సినిమాపై తెలంగాణలో గుర్రుగా ఉన్నారు. అందుకే ఈ సినిమాల విషయంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: