ఇలియాన ఆనందం రెట్టింపు అయింది. రేపు త‌ను న‌టించిన అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఫ‌టాపోస్టర్‌నిక్లాహీరో రిలీజ్ అవుతుంది. అంతే కాకుండా షాహిద్‌క‌పూర్ మ‌రో న్యూస్ చెప్పి ఇలియాన సంతోషాన్ని రెట్టింపు చేశాడంట‌. ఇలియానాకు ఆఫ‌ర్లు క‌రువైన రోజుల్లో షాహిద్ క‌పూర్ ద‌గ్గర ఉండి ఇలియాన‌కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకే షాహిద్‌క‌పూర్ అంటే ఇలియానాకు ఎంతో ఇష్టం. రేపు రిలీజ్ అవుతున్న ఫ‌టాపోస్టర్‌నిక్లాహీరో  మూవీ స‌క్సెస్ అయినా కాక‌పోయినా ఇలియానకి బాధే లేదంట‌. ఎందుకంటే ఈ మూవీలో ఇలియాన యాక్టింగ్ అండ్ గ్లామ‌ర్ రెండూ ఇర‌దీసింది. 

అందుకే ఫ‌టాపోస్టర్‌నిక్లాహీరో  మూవీ ప్రివ్యూను చూసిన బాలీవుడ్ ఇలియాన న‌ట‌న‌ను, అందాల‌ను ఎంత‌గానో అప్రిషియేట్ చేశారంట‌. అందుకే ఇలియాన త‌న‌ మూవీ రిలీజ్ కంటే ముందుగానే తెగ సంతోష‌ప‌డుతుంది. ఇదిలా ఉంటే ఇలియాన‌తో మ‌రో మూవీను చేసేందుకు షాహిద్‌క‌పూర్ రెడీగా ఉన్నాడంట‌. ఎట్ ప్రజెంట్ ఇలియాన రెండు బాలీవుడ్ ఫిల్మ్స్‌లో న‌టిస్తుంది. ఈ రెండింటి త‌రువాత మ‌ళ్ళీ షాహిద్‌క‌పూర్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది. అందుకే షాహిద్ క‌పూర్ ఇచ్చిన ఆఫ‌ర్‌కు ఇలియాన ఎగిరి గంతేస్తుంద‌ని బాలీవుడ్‌ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: