నితిన్ ఎట్‌ప్రెజెంట్ న‌టిస్తున్న హార్ట్ఎటాక్ మూవీపై ఆనందంలో ఉన్నాడు. ఈ మూవీపై పూరిజ‌గ‌న్నాధ్ ఖ‌ర్చు పెట్టిస్తున్న తీరుపై సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి విమ‌ర్శలు ఎదుర‌వుతున్నాయి. నితిన్‌పై ఇంత ఖ‌ర్చు పెట్టడం క‌రెక్ట్ కాద‌ని, పూరి చేస్తున్నది మూవీకు మైన‌స్ అవుతుంద‌ని ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే నితిన్ మాత్రం పూరి ఖ‌ర్చు పెడితే పెట్టాడు కాని, దానికి త‌గ్గ ఫ‌లితం మాత్రం అదే రేంజ్‌లో ఇస్తున్నాడ‌ని తెగ సంతోషంగా ఉన్నాడంట‌. నితిన్‌ను పూరిజ‌గ‌న్నాధ్‌ ఇంతలా ఏ విధంగా సంతోష పెట్టాడ‌ని తెలుసుకుంటే ఇలా తెలిసింది.

హార్ట్ ఎటాక్ మూవీకు అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్స్ సూప‌ర్బ్‌గా ఉన్నాయంట‌. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న నితిన్‌కి ఆ మూవీల‌లోని మ్యూజిక్ ఎంతో అండ‌గా నిలిచింది. అనూప్ రీసెంట్‌గా వినిపించిన కొన్ని ట్యూన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించాయ‌ని నితిన్ చెబుతున్నాడు. అనూప్ నుండి ఇంత మంచి మ్యూజిక్‌ను తీసుకున్నందుకు పూరిజ‌గ‌న్నాధ్‌కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు నితిన్‌. సెప్టెంబర్ చివ‌రి వారంనుండి స్పెయిన్ లో జ‌రిగే షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవుతుంద‌ని యూనిట్ అంటుంది. మొత్తంగా పూరి ఎంత ఖ‌ర్చు పెట్టించినా, దానికి ఓ లెక్క ఉంటుంద‌ని అంటున్నారు కొంద‌రు. మూవీ రిలీజ్ అయితేకాని ఆ లెక్కకి ఉన్న తిక్కేంటో తేలుస్తారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: