గ్రీక్ శిల్పంలా ఉండే హృతిక్ రోషన్ ను ఇష్టపడని వారు ఉండరు. బాలీవుడ్ సినిమా ప్రపంచంలో హృతిక్ ది ఒక ప్రత్యేక స్థానం. దీపావళి కి రిలీజ్ కాబోతున్న ‘క్రిష్-3’ సినిమా కోసం ఒక డేంజరస్ ఫైట్ చేస్తూ గాయపడిన హృతిక్ కు బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ అనారోగ్యం నుండి కోలుకుంటున్న హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితంపై బాలీవుడ్ మీడియాలో రకరకాల కధనాలు వినిపిస్తున్నాయి.

హృతిక్ రోషన్ కు ఆయన భార్య సుస్సానే కి మధ్య విభేదాలు వచ్చాయని, వీరు ప్రస్తుతం కలిసి ఉండడం లేదని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా రాతలు రాస్తుంది. కాని వీరిద్దరూ విడిపోతున్న కారణం విన్నవారందరికీ షాకింగ్ న్యూస్ గా ఉంది. ఈమధ్య న హృతిక్ తన తండ్రి రాకేశ్ రోషన్ పుట్టిన రోజును ముంబాయి లో అత్యంత ఘనంగా నిర్వహించాడట. అయితే ఈ వేడుకకు హృతిక్ భార్య సుస్సానే చాలా ఆలస్యంగా రావడంతో కోపగించిన హృతిక్ ఆమెపై ఆ పార్టీలోనే చిందులు వేశాడట. దీనితో షాక్ కు గురి అయిన సుస్సానే తన తల్లి తండ్రులకు హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ సరైన మర్యాద ఇవ్వడంలేదని విసురుగా సమాధానం చెప్పి ఆ పార్టీ నుండి వెంటనే వెళ్లిపోయిందట. ఆ తరువాత కూడా సుస్సానే తన తల్లితండ్రుల వద్దనే ఉంటూ హృతిక్ తో గ్యాప్ మెయిన్ టైన్ చేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

హృతిక్ పిల్లలు కూడా మన కండల వీరుడి ఇంటిలోనే ఉంటున్నారట. బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ గా పేరుగాంచిన హృతిక్ – సుస్సానే ల కు 2000 సంవత్సరంలో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా బాలీవుడ్ లో ఏ కార్యక్రమం జరిగినా జంటగా కనిపించి హడావుడి చేసే ఈ హాటెస్ట్ కపుల్ విడిపోవడానికి కారణం ఈ పుట్టినరోజు వేడుకలు కావని, వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా అంతా ప్రస్తుతం ఈ విషయంపై రంధ్రాన్వేషణ చేసే కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈమధ్యనే తగిలిన దెబ్బ నుండి కోలుకుంటున్న హృతిక్ కు ఈ పుట్టినరోజు గోల ఏమిటో అంటూ బాలీవుడ్ మీడియా లో వార్తలు కనిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: