భారతదేశ౦ లోని అన్ని భాషలలోనూ సినిమాలు నిర్మించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కు ఎక్కి టాలీవుడ్ ఖ్యాతి ని భారత సినిమా రంగానికి చాటిన డి.రామానాయుడు ఈరోజు సాయంత్రం నుండి చెన్నైలో ప్రారంభం కాబోతున్న వందేళ్ళ సినిమా పండుగ ఉత్సవాలపై ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సినిమా రంగంలో సంపాదించిన సంపాదన అంతా అదే సినిమా రంగంపై పెట్టుబడి పెట్టిన రామానాయుడు కు సినిమా రంగం అంటే ఉన్న మోజు అందరికీ తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలలో ఒకసారి తాను ఓడిపోతే తనతత్వం రాజకీయాలకు పనికిరాదని, ప్రజలు పనిచేసే వారికంటే కబుర్ల తో కడుపు నింపేవారికే ఓట్లు వేస్తారని అప్పట్లో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రామానాయుడు.

ప్రస్తుత౦ చెన్నై లో అత్యంత ఘనంగా జరగబోతున్న వందేళ్ళ సినిమా పండుగ ఉత్సవాలకు రామానాయుడు కు వ్యక్తిగత ఆహ్వానం రాలేదు అంటే ఎవరూ నమ్మరు. కాని ఇది నిజం. రామానాయుడు కి ఈ వందేళ్ళ పండుగను చూడాలని అనిపించి ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్న కమిటీ లోని సి.కళ్యాణ్ ను తాను ఆ వేడుకకు రావచ్చా..? అంటూ ప్రశ్నించారట. దానికి కళ్యాణ్, మీకు ఆ వందేళ్ళ పండుగ కార్యక్రమాలలో సన్మానం ఉంది అని కళ్యాణ్ చెపితే ఏమనాలో అర్ధంకాని రామానాయుడు తనకు ఆ ఫంక్షన్ చూడాలని ఉందని, వీలు అయితే ఒక ఇన్విటేషన్ పంపించమని అడిగారట.

వందకు పైగా సినిమాలు నిర్మించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను పొందిన తనలాంటి వారికే గుర్తింపు లేకుంటే ఈ వందేళ్ళ ఉత్సవాలు దేనికీ అంటూ రామానాయుడు నిరాశను వ్యక్తపరచడమే కాకుండా కళకు, రాజకీయాలకు సంబంధాలు పులుముతూ ప్రతీ విషయాన్నీ రాజకీయం చేసేస్తున్న నేటి టాలీవుడ్ రంగంలో తనకు ఏమి మాట్లాడాలో తెలియడం లేదు అంటూ ఆవేదన వ్యక్త పరుస్తున్నారు మన స్టార్ ప్రొడ్యూసర్.    
 

మరింత సమాచారం తెలుసుకోండి: