జంజీర్ రిలీజ్‌కి ముందు నుండే బాలీవుడ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌కు ఆఫ‌ర్ల వ‌ర‌ద పెట్టింది. జంజీర్ రిలీజ్ టాక్‌ను ప‌ట్టించుకోకుండా చ‌ర‌ణ్‌తో మూవీ తీసేందుకు బాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి ఎంతో మంది ప్రొడ్యూజ‌ర్లు,డైరెక్టర్లు చ‌ర‌ణ్‌కి స్టోరీను వినిపించేదుకు లైన్లో ఉన్నారు. చ‌ర‌ణ్ మాత్రం వాటిని సున్నితంగా తిర‌స్కరించి జంజీర్ త‌రువాత చూద్దాంలే అని ప‌క్కన పెట్టేశాడు. ఆ విధంగా ఆఫ‌ర్ ఇచ్చిన వాళ్ళలో క‌ర‌ణ్ జోహార్‌, స‌ల్మాన్‌ఖాన్‌, మ‌రో మూవీ కోసం అపూర్వ లఖియా, అలాగే య‌ష్ చోప్ర ఫిల్మ్స్ నుండి చ‌ర‌ణ్‌కి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. వీళ్ళంద‌రికి జంజీర్ త‌రువాత‌నే అంటూ ఆ టాపిక్‌ను దాట‌వేశాడు.

జంజీర్ రిలీజ్ త‌రువాత ఆ మూవీ స‌క్సెస్‌ను చూసిన అంద‌రూ చ‌ర‌ణ్‌కి ఇక బాలీవుడ్ ఆఫ‌ర్లు కాదు క‌దా, అక్కడ చ‌ర‌ణ్‌ను చూసేవాళ్ళు కూడ ఉండ‌రు అని అనుకున్నారు. కాని అంద‌రూ ఊహించిన దానికి రివ‌ర్స్‌లో జ‌రుగుతుంది. రీసెంట్‌గా క‌ర‌ణ్‌జోహార్, చ‌ర‌ణ్‌తో ఓ మూవీను తీసేందుకు రెడీ అయ్యాడు. అలాగే అపూర్వ ల‌ఖియా మ‌రో మూవీను తీద్దాం, ఈ సారి స‌క్సెస్ గ్యారెంటీ అంటూ చ‌ర‌ణ్ కాల్షీట్లను అడిగాడు. జంజీర్ స‌క్సెస్ చూసిన త‌రువాత కూడ బాలీవుడ్ వాళ్ళు చ‌ర‌ణ్‌పై చూసిన్తున్న ఆధ‌ర‌ణ‌ను చూస్తుంటే ఈ మెగాహీరో ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు. అయితే బాలీవుడ్ మూవీల ఆఫ‌ర్లకు మాత్రం నో చెప్పేస్తున్నాడు. ఇప్పుడు న‌టించ‌డం సాధ్యం కాదంటూ సారి చేస్పేస్తున్నాడు. చ‌ర‌ణ్‌ని అప్రోచ్ అవుతున్న వాళ్ళు అంద‌రూ జంజీర్ రిలీజ్‌కి ముందే చ‌ర‌ణ్‌కి మూవీ ఆఫ‌ర్ ఇస్తామ‌ని మాట ఇచ్చిన వాళ్ళే. స‌క్సెస్‌ను పట్టించుకోకుండా మ‌నిషిని ఇంతగా గుర్తుపెట్టుకోవ‌డం అనేది నిజంగా గ్రేట్ అని చ‌ర‌ణ్, బాలీవుడ్ ప్రేమ‌కు ఫిదా అవుతున్నాడంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: