ఇండస్ట్రీని చూసుకుంటే హీరోల కొడుకులు హీరోలై దున్నేశారు తప్ప, ఏ హీరో కూతురూ హీరోయినై ఏలింది లేదు. కానీ ఇప్పుడు రాజశేఖర్ కూతురు హీరోయిన్ కాబోతోంది. అంటే... కూతుళ్లకు టైమొచ్చిందన్నమాట!

బాలీవుడ్లో హీరోల కొడుకులతో పాటు కూతుళ్లు కూడా సినిమాల్లోకి ఈజీగా వచ్చేస్తారు. ట్వింకిల్ ఖన్నా, ఇషా డియోల్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా... వీళ్లంతా బాబుల పేర్లు చెప్పుకుని సినిమాల్లో ఎంటరైనవాళ్లే. ఈ మధ్య తమిళ హీరోల కూతుళ్లు కూడా ముఖాలకు మేపక్ వేస్తున్నారు. కమల్ కూతురు శృతి ఏ రేంజ్ కి వెళ్లిందో చూశాం కదా. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా నటిగా అందరి మెప్పునూ పొందింది. అయితే వాళ్లకు వాళ్ల తండ్రులు అడ్డు చెప్పలేదు. కానీ మనకు అలా ఉండదు. ఇండస్ట్రీని చూసి వచ్చాం కాబట్టి, అక్కడిని మన అమ్మాయిలను పంపడం ఎందుకు అన్నట్టు ఆలోచిస్తుంటారు మన హీరోలు. అందుకే ఏ హీరో కూతురూ హీరోయిన్ కాదిక్కడ. అయితే ఆ ఆలోచనకు తెరదించిన రాజశేఖర్ ని మెచ్చుకుని తీరాలి. 

తన కూతురు శివానీని హీరోయిన్ గా రంగప్రవేశం చేయించడానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాడు రాజశేఖర్. జీవిత దర్శకత్వం వహించనున్న వందకు వంద చిత్రంలో మెయిన్ లీడ్ గా చేయబోతోంది శివాని. పదిహేడేళ్ల ఈ చిన్నది చక్కని నవ్వుతో, చలాకీగా తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే చాన్సులు కొట్టేయొచ్చు. జెండా పాతేయొచ్చు. అదే జరిగితే, టాలీవుడ్ టాప్ స్టార్ అయిన హీరో కూతురిగా శివాని సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందు ముందు ఇంకొందరు హీరోల కూతుళ్లు కూడా నటీమణులవుతారేమో చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: