మరి కొద్ది సేపట్లో జూనియర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ పాటల ఆడియో సందడి జరగబోతోంది.  అయితే ఇప్పటికే నెట్ లో ఈ సినిమా పాటలు హల చల్ చేస్తున్నాయి. ఈ సాంగ్స్ విన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఏ పాటకు ఆ పాటే మరో పాటతో పోటీ పడుతూ జూనియర్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

ముఖ్యంగా రెండు మెలోడీ పాటలతో పాటు ‘రామయ్యా వస్తావయ్యా’ టైటిల్ సాంగ్ సూపర్బ్ గా ఉన్నాయి అంటూ ఎన్టీఆర్ అభిమానులు పొంగిపోతున్నారు పొగరుతో పోటెక్కి ఉన్నా సలాం చేస్కో పోరుకొస్తే ఎప్పుడైనా జోరు చూసి గులాం  చేస్కో అనే సాంగ్ తో పాటు రెండు మెలోడీ పాటలు సినిమాకు హైలెట్ కానున్నాయి అనే వార్తలు వస్తున్నాయి ఇక ‘రామయ్య వస్తావయ్యా’ టైటిల్ సాంగ్ అయితే అభిమానులను దృష్టిలో పెట్టు
కొని పాటను రాసినట్లుగానే ఉంది.

టైటిల్ పాటలో నమ్మినోళ్ళకే నే బానిసా... గిట్టనోళ్లకే  బాదుషా...అన్నదమ్ములే నన్ను వీడనీ... మీరుండగా ఎదనిండుగా అనే పాట జూనియర్ అభిమానులను ఉద్దేసించి వ్రాసిన పాటగా అనిపిస్తోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఆడియో వేడుక వేదిక నుండి మన బుడ్డోడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమైఖ్య ఉద్యమం పై తన మౌనాన్ని వీడి మాట్లాడుతాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఈ విషయం పై మాట్లాడినా మాట్లాడక పోయినా ఈ సినిమా పాటలు మాత్రం మన బుడ్డోడి సినిమాను సూపర్ హిట్ రేంజ్ కు తీసుకువెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: