పేదోడు కరెంటు బిల్లు కట్టలేదని, ఇంటి అద్దె కట్ట లేదని, అప్పుకి వడ్డీ కట్టలేదని వింటే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఫుల్లుగా డబ్బులున్నవాళ్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టారని తెలిస్తే ఏమంటాం? ఏమి అనగలం? ముఖ్యంగా సినిమా వాళ్లు చాలామంది ట్యాక్సులు ఎగ్గొడుతూ ఉంటారని ఐటీ డిపార్ట్ మెంట్ వాళ్లు అంటున్నారు. అందుకే వాళ్లు అప్పుడప్పుడూ ప్రత్యేకంగా సినిమా వాళ్ల మీద ఓ రివ్యూ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరు కడుతున్నారు, ఎవరు ఎగ్గొడుతున్నారు అని లెక్కలు వేసి చూసుకుంటారు. తేడా వచ్చిందని తెలిస్తే రెయిడ్ చేస్తుంటారు. ఈ మధ్యే ఈ తతంగం మళ్లీ మొదలైంది. ఐటీ వాళ్ల కన్ను సెలెబ్రిటీల మీద పడింది.

ఈ మధ్య కొందరు యువ హీరోలు పన్ను ఎగ్గొట్టి ఐటీ డిపార్ట్ మెంట్ తో అక్షింతలు వేయించుకుంటున్నారు. మొన్ననే సర్వీసు ట్యాక్స్ ఎగ్గొట్టాడంటూ నితిన్ కి నోటీసులు పంపించారు సదరు డిపార్ట్ మెంట్ వారు. అసలెంత బాకీ పడ్డాడా అని ఆరా తీస్తే కొన్ని లక్షలు కట్టాలని తెలిసింది. ఆ అంకెలు చూసి కళ్లు తిరిగినంత పనయ్యింది. ఇప్పుడు తాజాగా వరుణ్ సందేశ్ కూడా అదే పని చేశాడని తెలిసింది. ఈయనగారు కూడా కాస్త పెద్ద మొత్తంలోనే సర్వీసు పన్ను, ఆదాయపు పన్ను కట్టాలట. దాంతో గుర్తు చేసీ చేసీ విసిగిపోయిన ఐటీ డిపార్ట్ మెంట్ వారు అయ్యగారికి నోటీసులు పంపారు. డెడ్ లైన్ చెప్పి, ఆలోపు కట్టకపోతే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారట.

ఈ ఇద్దరే కాదు. ఇలా పన్ను ఎగ్గొడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారని తేలడంతో, వాళ్లందరి లిస్టూ తయారు చేసిందట ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్. ఈ లిస్టులో ఎక్కువమంది యువ హీరోలే అని సమాచారం. త్వరలోనే చిన్న హీరోల ఇళ్లమీద భారీగా రైడ్లు జరగవచ్చని తెలుస్తోంది. అయినా పన్ను ఎగ్గొట్టడానికి వీళ్లేమైనా పేదవాళ్లా? సినిమాకి లక్షలు లక్షలు తీసుకుంటున్నారు కదా! ప్రభుత్వం సొమ్ము ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఇలా వార్నింగులు అందుకోవాల్సిన పని ఉండదు, పరువు పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: