చిన్న చిన్న పాత్రలు చేస్తూ హటాత్తు గా అందరినీ ఆశ్చర్య పరుస్తూ రాత్రికి రాత్రే స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయిన బండ్ల గణేష్ వ్యక్తిత్వం ఎప్పుడూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గానే ఉంటుంది. తన సినిమాలు తీసే దర్శకుడికి వజ్రాల లైటర్ కొని బహుమతి గా ఇవ్వగల కెపాసిటీ ఆయనకే సొంతం. నిర్మాతగా గణేష్ తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రోత్సాహం తో ‘గబ్బర్ సింగ్’ ఇచ్చిన పేరు తో సంవత్సరం తిరిగకుండానే స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు గణేష్.

మొట్టమొదట ఈయన సినిమా నిర్మాణ కార్యక్రమాలకు బినామీ గా ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అంటూ తెగ వార్తలు వచ్చేవి. దాని తరువాత గణేష్ వెనుక పివిపి సినిమా అధినేత పోట్లురి వరప్రసాద్ ఉన్నాడు అంటూ అనుకొనేవారు. అయితే పోట్లురి వరప్రసాద్ కూడా తానే సొంతంగా నిర్మాణ సంస్థ ను పెట్టుకొని ‘బలుపు’ సినిమాతో నిర్మాతగా మారిపోవడంతో గణేష్ ఉనికి ప్రశ్నార్ధకంగా మారి ఆయన నిర్మాతగా ఇక కొనసాగాలేడేమో అంటూ చాలామంది ఆయనపై సెటైర్లు వేశారు. ఆ తరువాత ముంబాయి కి చెందిన వెంకీ ఫుడ్ అధినేత బాలాజీ రావు గణేష్ కు గాడ్ ఫాదర్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపధ్యంలోనే గణేష్ కు రామ్ చరణ్ కొరటాల శివ ప్రాజెక్ట్ కు ఒకే అనడం, సినిమా ముహూర్తపు షాట్ కూడా తీసుకోవడం, అన్నీ చకచక జరిగిపోయాయి.

కాని ఏమైందో తెలియదు కాని ముంబాయి కి చెందిన ఈ బాలాజీ రావు కూడా గణేష్ వెనుక గాడ్ ఫాదర్ గా లేడు అన్న వార్తలు గుప్పుమన్న కొద్ది రోజులకే చరణ్ గణేష్ ల సినిమా కాన్సిల్ అయింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన రెండు బడా సినిమాలు ‘బాద్ షా’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన గణేష్, సినిమాలు తీద్దాం అంటే ప్రస్తుతం ఏ హీరో ఖాళీ లేదు అని చెపుతున్నారట.  సంవత్సరం తిరిగకుండానే స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన గణేష్ కు ఈ పరిస్థితి ఏమిటి అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: