సంతోషంలో పాలు పంచుకోకపోయినా ఫర్వాలేదు, కష్టంలో మాత్రం పాలు పంచుకోవాలి అంటారు మన పెద్దలు. అత్తారింటికి దారేది విషయంలో అందరూ ఆ మాటను నిజం చేశారు. పవన్ కోసం, అతడి సినిమా కోసం ఏక కంఠంతో ఒకే మాటను పలికారు... కిల్ పైరసీ అని.

 అత్తారింటికి దారేది పైరసీ సీడీ మామూలు షాక్ ఇవ్వలేదు. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే, ఓ సినిమా విడుదల కాకుండానే సీడీ రూపంలో బయటకు రావడం అనేది బహుశా ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదు. దాంతో ఏం జరిగిందో కాసేపు ఎవరికీ అర్థమే కాలేదు. అర్థమయ్యాక అందరి కడుపులూ మండిపోయాడు. దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ అన్న తేడా లేకుండా అందరూ పైరసీ మీద ధ్వజమెత్తారు. చివరకు ఫ్యాన్స్ కూడా తమ ప్రతాపాన్ని చూపారు. సాధారణంగా ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోకి ఉంటారు. వాళ్లు తమ హీరోకి, అతడి సినిమాలకి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఇన్ వాల్వ్ అవుతారు. కానీ ఇప్పుడలా జరగలేదు. ఏ హీరో అనే తేడా లేకుండా అందరూ పవన్ వెనుక నిలబడ్డారు. పైరసీని అరికడతాం, ప్రోత్సహించం అంటూ ప్రతిజ్ఞ పూనారు. బాలయ్య, మహేశ్ బాబు, ఎన్టీయార్ ల అభిమానులు సీడీ షాపుల మీద, సెల్ ఫోన్ షాపుల మీద రైడ్ చేశారు. ఎక్కడికక్కడ చెకింగ్ చేసి పైరసీని అరికట్టేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 


 ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మా హీరో బాగుండాలి, మా హీరో సినిమా హిట్టవ్వాలి అని మాత్రమే అభిమానులు ఆలోచిస్తారు అన్న ఆలోచనలకు ఈ సంఘటన ఫుల్ స్టాప్ పెట్టింది. అభిమాని అన్నవాడు ఏ హీరోనయినా ఒకలానే చూస్తాడని, ఏ హీరోకి చెడు జరిగినా తమ హీరోకి జరిగినట్టే ఫీలవుతారని తొలిసారి తెలిసి వచ్చింది. సినిమా చరిత్రలో ఇది ఎన్నడూ జరిగివుండదేమో. ఇగోలు మరచి, స్వార్థాన్ని విడికి పవన్ సినిమా కోసం ముందుకొచ్చిన వీళ్లందరికీ హ్యాట్పాఫ్ చెప్పి తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: