బాలీవుడ్ హీరోలు అందరికీ ఫేవరెట్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ఇలా టాప్ హీరోలు అంతా సోనాక్షి తో రొమాన్స్ చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటారు. సోనాక్షి కూడా అందరి టాప్ హీరోలతో అలాగే టాప్ డైరెక్టర్స్ తో పనిచేస్తూ బాలీవుడ్ గాసిప్స్ లో తన పేరు రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా మెయిన్ టైన్ చేస్తూ ఉంటుంది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో నటించినా ఎటువంటి గాసిప్స్ తన వ్యక్తిగత జీవితంపై లేకుండా నెట్టుకొస్తోంది మన శత్రుఘ్న సిన్హా కూతురు.

అయితే ఈ బొద్దు ముద్దుగుమ్మ సోనాక్షి కి కూడా ఒక డార్క్ సీక్రెట్ ఉంది. అది ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయిన్ టైన్ చేస్తోందట సోనాక్షి. సోనాక్షి కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే విపరీతమైన ఇష్టం అట. ఆమె హృదయంలో హృతిక్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చిందట సోనాక్షి. అదేమిటీ అనుకుంటున్నారా..? సోనాక్షి ఇంటిలో ఒక ప్రత్యేకమైన రూమ్ ఉందట. ఆ రూమ్ నిండా హృతిక్ బొమ్మలే ఉంటాయట. ఈ మధ్య సోనాక్షి హీరోయిన్ గా చాలా బిజీగా ఉండడంతో రోమన్ శిల్పం లాంటి హృతిక్ ఫోటోలను సరిగ్గా అమర్చడంలో కొద్దిగా అశ్రద్ధ చేసినా, తనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆ రూమ్ లోకి వెళ్లి హృతిక్ బొమ్మలను చూస్తూ కలల్లోకి వెళ్ళిపోతుందట మన ముద్దుగుమ్మ.

అంతేకాదు ‘క్రిష్-3’ రాకకోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సోనాక్షి కి బాలీవుడ్ లో హృతిక్ తో, టాలీవుడ్ లో మహేష్ బాబు తో నటించాలి అన్నది ఆమె కల అట. మరి హృతి రోషన్ , మహేష్ బాబు లు సోనాక్షి కలలను నిజం ఎప్పడు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: