ఓ ఇమేజ్ అంటూ వచ్చాక ఆ హీరో మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి అందరికీ. అంచనాలు ఎప్పుడైతే పెరుగుతాయో, ఊహాగానాలు కూడా బాగా జోరందుకుంటాయి. అతడొక సినిమా చేస్తున్నాడని తెలిస్తే చాలు... ఏ పాత్ర చేస్తున్నాడు, ఎలాంటి పాత్ర చేస్తున్నాడు, బహుశా అదనుకుంటా, కాదు కాదు ఇదనుకుంటా అంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడేస్తుంటారు. రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీయార్ పాత్ర గురించి కూడా అలాంటి చర్చలే జోరుగా సాగుతున్నాయి.

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీయార్ గ్లామర్ చూసి జనం మతులు పోతున్నాయి. పోస్టర్లు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఆడియో కూడా అదిరిపోవడంతో వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అయితే వారిని మొదట్నుంచీ ఓ అనుమానం పీడిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీయార్ పాత్ర ఏమై ఉంటుంది అన్న వారి సందేహం ఇంతవరకూ నివృత్తి కాలేదు. మొదట్లో అతడు విద్యార్థిగా చేస్తున్నాడని, స్టూడెంట్ లీడర్ గా కనిపించి అలరిస్తాడని అన్నారు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. రామయ్యాలో ఎన్టీయార్ స్టూడెంట్ లీడర్ కాదు, పోలీసాఫీసర్ అనే వాదన మొదలయ్యింది. ఎన్టీయార్ పోలీసాఫీసరని, సినిమాలో చాలా వరకూ యూనిఫామ్ తో కనిపించనున్నాడని తెగ ఊహించేస్తున్నారంతా.


 అయినా కొద్ది రోజులు కళ్లు మూసుకుంటే సినిమా రిలీజైపోతుంది. అంతవరకూ ఆగొచ్చు కదా! స్టూడెంట్ లీడరా పోలీసా అంటూ ఇలా జుట్లు పీక్కోవడం వల్ల ఏమయినా ఉపయోగం ఉందా చెప్పండి. మరో విషయం ఏమిటంటే... బాద్ షా క్లయిమాక్స్ లో ఎన్టీయార్ కాసేపు పోలీసుగా కనిపించాడు కదా! మళ్లీ పోలీసు పాత్ర ఎందుకు చేస్తాడు చెప్పండి! ఒకవేళ చేసినా సినిమా చూశాక తెలుస్తుంది కదా! కాస్త ఓపిక పట్టండి బాస్!

మరింత సమాచారం తెలుసుకోండి: