సినిమా రంగం అంటేనే సెంటిమెంట్ల మయం. ఆ సెంటిమెంట్ల తోనే సినిమా టైటిల్స్, హీరోలు, హీరోయిన్లు, దర్శకులు డిసైడ్ అవుతూ ఉంటారు. చాలాకాలం పరాజయాల బాట పట్టిన తరువాత మంచు విష్ణు గత సంవత్సరం దసరా కు ‘దేనికైనా రెడీ’ సినిమా ద్వారా విజయాన్ని అందుకున్నాడు. విష్ణు కెరియర్ లోనే అత్యధిక వసూళ్ళు చేసిన సినిమాగా దేనికైనా రెడీ రికార్డు క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం విష్ణు హీరోగా నటిస్తున్న ‘దూసుకేళ్తా’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఆ సినిమాను తనకు కలిసివచ్చిన అక్టోబర్ 24 వ తారిఖునాడు విడుదల చెయ్యడానికి హీరో విష్ణు ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

అదే విధంగా టైటిల్ పరంగా కూడా తనకు కలిసివచ్చే “D” లెటర్ ను కలుపుకొని దూసుకేళ్తా అనే టైటిల్ పెట్టడానికి కూడా ఈ సెంటిమెంట్ యే కారణం అని అంటున్నారు. ‘అందాల రాక్షసి’ హీరోయిన్ లావణ్య తో మొట్టమొదటి సారి రొమాన్స్ చేస్తున్న విష్ణు, ఈ సినిమాను వీరుపోట్ల దర్శకత్వంలో తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. దేనికైనా రెడీ సినిమా లాగే యాక్షన్, హ్యుమర్, సెంటిమెంట్ లతో నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచువారి అబ్బాయి చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇంతకీ మంచు విష్ణు ఢీ సెంటిమెంట్ ఎంతవరకూ కలసివస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: