పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోపానికి కన్నడ మందారం ప్రణిత టార్గెట్ అవుతోంది అంటూ టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల కాకుండానే ప్రణితపై కోపం ఎందుకు అంటూ ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఈ ఆశక్తికర విషయం చదవండి. కన్నడ హీరోయిన్ ప్రణితకు ఐరన్ లెగ్ బ్యూటీ అనే పేరు టాలీవుడ్ లో ఉంది. ఇంతవరకూ ఆమె నటించిన సినిమాలు ఏమీ టాలీవుడ్ లో విజయవంతం కాలేదు.

పవన్ అత్తారింటికి దారేది లో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు గతంలో వచ్చినప్పుడే పవన్ అభిమానులు షాక్ అయ్యారు. ఈ ఐరన్ లెగ్ బ్యూటీ తమ పవర్ స్టార్ పక్కన ఏమిటి అంటూ గతంలోనే ఖంగారు పడ్డారు. అయితే త్రివిక్రమ్ – పవన్ ల ప్రోత్సాహంతో ప్రణిత ను ఈ సినిమాలో ఎంపిక చేశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆగష్టు లో విడుదల కావాల్సిన అత్తారింటికి దారేది రాజకీయ ఉద్యమాల నేపధ్యంలో వాయిదా పడడం, అలాగే మొన్న ఈ సినిమా పైరసీ కి గురి కావడం చూసి ఈ సంఘటనలు అన్నీ అశుభాలుగా కనిపిస్తున్నాయని, ఈ అనుకోని సంఘటనలకు, రగడలకు ఐరన్ లెగ్ బ్యూటీ ప్రణిత పాదమే కారణం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు  ప్రణిత ను ఆడిపోసుకుంటున్నారట.

అంతేకాదు ఈ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ తమ హీరో సినిమాకు ఎక్కడ తగులుతుందో అని కూడా భయపడుతున్నారట. కాని ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయ్యే వరకూ శ్రుతి హసన్ కు కూడా ఇలాంటి ఐరన్ లెగ్ ఇమేజ్ ఉండేది. పవర్ స్టార్ మాయతో ఒక్కరోజులో ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. చరిత్ర పునరావృతం అవుతుంది అన్నట్లుగా పవన్ ఇమేజ్ తో ఈ ఐరన్ లెగ్ బ్యూటీ అత్తారింటికి దారేది సినిమాతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపొయినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా నమ్మకాలకూ, సెంటిమెంట్లకు చిరునామాగా ఉండే సినిమా రంగంలో ఈ ప్రణిత సెంటిమెంట్ ఎల్లుండి రాబోతున్న అత్తారింటికి దారేది కి ఏ ట్విస్ట్ ఇస్తుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: