టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా బూతు సినిమాల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన’గ్రాండ్ మస్తీ’ సినిమా చిన్న సినిమాగా విడుదల అయి కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. కామెడీ సినిమా ముసుగులో విడుదల అయిన ఈ సినిమాకు ఉత్తరభారతదేశం లోని యూత్ బాగా ఆకర్షితం అవుతోంది. ఈ సినిమా అక్కడ జనానికి ఎంతగా నచ్చింది అంటే, ఈ సినిమాను చూస్తూ ముంబాయి లోని ఒక ధియేటర్ లో 22 ఏళ్ళ యువకుడు ఈ అడల్ట్ కామెడీ ని తట్టుకోలేక నవ్వీ నవ్వీ ధియేటర్ లోనే చనిపోయాడు. ఇది యదార్ధంగా జరిగిన సంఘటన.

ఈ సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశముఖ్ మన బొమ్మరిల్లు భామ జెనీలియా భర్త అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరిదీ ప్రేమ వివాహం కూడా. సంచలనాలు సృష్టిస్తున్న గ్రాండ్ మస్తీ సినిమాను చూసిన జెనీలియా ఆ సినిమాలోని కామెడీ ముసుగులో ఉన్న బూతు డైలాగ్ లను చూసి తట్టుకోలేక తెగ బాధపడిపోయి, తన ఇంటికి వచ్చాక తన భర్త రితీష్ దేశముఖ్ కు ఇటువంటి సినిమా ఎందుకు చేశావు అంటూ క్లాస్ పీకడమే కాకుండా ఇటువంటి సినిమాలు భవిష్యత్ లో రితీష్ చేస్తే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను అని బెదిరించిందట మన బొమ్మరిల్లు బ్యూటీ. దీనితో దిమ్మ తిరిగిన రితీష్ ఇటువంటి సినిమాలను భవిష్యత్ లో చెయ్యనని జెనీలియా కు మాట ఇచ్చాడట.

సినిమా లు ఎలాగో అలాగ హిట్ అయితే చాలు అని బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా కనిపించిన దేవుడికల్లా దండాలు పెడుతున్న ఈరోజుల్లో మరి జెనీలియా కు ఈ గ్రాండ్ మస్తీ చేసిన ఎందుకు అంత వెగటు పుట్టించిందో అర్ధం కాదు. ఏది ఏమైనా ఒక బూతు సినిమా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: