అత్తారింటికి దారేది మూవీ రీలీజ్‌కి రెండు రోజుల ముందుగానే టెలివిజ‌న్ ఛానల్స్‌లో భారీ ప్రమోష‌న్‌ను చేప‌ట్టారు. ఓ ప‌క్క అత్తారింటికి దారేది లీక్డ్ వీడియోతో  ప‌వ‌న్ మూవీకు ఎక్కడ‌లేని ప‌బ్లిసిటి వ‌చ్చింది. ఇంత‌కు మించిన ప్రమోష‌న్ అత్తారింటికి దారేది మూవీకు మ‌రొక‌టి ఉండ‌దు. అందుకే చాలా మంది ఇక అత్తారింటికిదారేది మూవీ ప్రమోష‌న్ టెలివిజ‌న్స్‌లో ఉందంటుంన్నారు. దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ టెలివిజ‌న్‌లోని మార్కెటింగ్ ప‌ర్సన్స్ యాడ్స్ నిమిత్తం, ప్రొడ్యూజ‌ర్‌ను అప్రోచ్ అవ్వాలో లేదో అర్ధం కాక రెండు రోజుల నుండి డైల‌మాలో ప‌డ్డారు. ఇదిలా ఉంటే ప్రొడ్యూజ‌ర్ మాత్రం టెలివిజ‌న్ ప్రమోష‌న్‌ను ఆపేది లేదంటూ డిసైడ్ అయ్యాడు.

దానికి సంబంధించిన టెలివిజ‌న్ క్యాంపెయింన్‌ను ఈ రోజు నుండే స్టార్ట్ చేశారు. మొత్తం ప‌దిహేను న్యూస్ ఛానల్స్‌కు సంబంధించిన ప్రమోష‌న్‌ క్యాంపెయిన్ అలాగే ఏడు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్స్‌కు సంబంధించిన ప్రమోష‌న్ క్యాంపెయిన్ కోసం దాదాపు కోటి రూపాయ‌ల‌ను ప్రొడ్యూజ‌ర్ ఖ‌ర్చు చేస్తున్నట్టు స‌మాచారం. ఓ ప‌క్క ప‌వ‌న్ లీక్డ్ మూవీతో ప్రొడ్యూజ‌ర్ నిరాశ‌లో ఉంటూనే, ప్రమోష‌న్‌ను మాత్రం ఆపేది లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రొడ్యూజ‌ర్ ఇంత‌లా ఖ‌ర్చు చేయ‌టానికి కార‌ణం లీక్డ్ మూవీ ఎఫెక్ట్ వ‌ల్ల ప‌వ‌న్ క‌లెక్షన్స్‌ను ఏ మాత్రం త‌గ్గించ‌లేవని ధీమాగా ఉన్నాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: