పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ పైరసీని ఖండిస్తూ నిన్న టాలీవుడ్ ప్రముఖులు రకరకాలుగా స్పందించి అత్తారింటికి దారేది సినిమా నిర్మాతకు బాసట గా నిలిచారు. అయితే పవన్ కళ్యాణ్ వీరాభిమాని హీరో నితిన్ మాత్రం కొద్దిగా వెరైటీ గా మరీ స్పష్టంగా చెప్పాలి అంటే బూతులను వాడుతూ ట్విట్ పెట్టి సంచలనం సృష్టించాడు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ కి ప్రధానం కారణం అయిన ఎడిటింగ్ రూమ్ లో పనిచేసే అరుణ కుమార్ అనే వార్తలు రావడంతో ఆ పేరు విని హీరో నితిన్ షాక్ అయ్యాడట.

దీనికి కారణం నితిన్ గతంలో నటించిన ‘గుండెజారి గల్లంతైందే’, అలాగే ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాకు కూడా ఈ అరుణ కుమార్ యే అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేయడం అని అంటున్నారు నితిన్. అంతేకాకుండా ఇంత భారీ స్కాం ను అరుణ కుమార్ లీక్ చేశాడు అంటే నమ్మలేకపోతున్నానని కూడా అంటున్నాడు హీరో నితిన్. అయితే ఇటువంటి వ్యక్తులను వదలకూడదు అంటూ ఇలా ట్విట్ చేశాడు మన హీరో. ‘గతంలో గుండెజారి గల్లంతైందే సినిమాకు పనిచేసి ప్రస్తుతం కొరియర్ బాయ్ కళ్యాణ్ కు పనిచేస్తున్న అరుణ కుమార్ ఈ పనిచేశాడు అంటే నమ్మలేకపోతున్నాను, ఈ విషయం నాకు ఎంతో షాకింగ్ న్యూస్ గా ఉంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి.మరోసారి ఇలా ఇటువంటి ఆలోచనలు ఎవరికీ రాకుండా ఉండాలి అంటే ఉచ్చ పడిపోవాలి’ అంటూ తన ఆవేశాన్ని తన ట్విట్టర్ లో వ్యక్త పరచాడు హీరో నితిన్.

నైజాం ఏరియాకు అత్తారింటికి దారేది ని తన తండ్రి సుధాకర్ రెడ్డి పంపిణి సంస్థ గ్లోబల్ మీడియా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్న నితిన్ కు ఈ పైరసీ వార్త ఎంత షాక్ కు గురి చేసిందో నితిన్ ట్విట్ బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇంత వరకూ నైజాం ఏరియాలో ఏ డిస్ట్రిబ్యూటర్ పెట్టని ఫాన్సీ ప్రైస్ కు కొనుక్కున్న నితిన్ కు సహజంగానే ఈ పైరసీ వ్యవహారం ఆవేశం కలిగించింది అనుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: