ఎక్కడ చూసినా ప‌వ‌న్ లీక్డ్ మూవీ ర‌చ్ఛే. ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఈ త‌ర‌హా లీక్డ్ మూవీ బ‌య‌ట‌కు రావ‌డం ఇదే మొద‌టిసారి కావ‌చ్చు. టాప్ రేంజ్ హీరో మూవీకే బ‌ద్రత లోపించ‌డం అంటే సామాయ్యవిష‌యం కాదు. ఇప్పటి వ‌ర‌కు లీక్డ్ వీడియో,లీక్డ్ సీన్‌, లీక్డ్ అన్‌సెన్సార్డ్ హాట్ ఇలాంటి వీడియోల‌న్ని బాలీవుడ్‌కే ప‌రిమితం అయింది. లేటెస్ట్‌గా జరిగిన ప‌వ‌న్ లీక్డ్ మూవీ ఆ రికార్డుల‌ను బ్రేక్ చేసి మొద‌టి వ‌రుస‌లో ఉంది. ఈ విష‌యంలో కేవ‌లం టాలీవుడ్‌కే ప‌రిమితం కాలేదు. యావ‌త్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు పాకింది. అన్ని చోట్ల నుండి ఇది ఎలా సాధ్యం అంటూ మాట్లాడుకోవ‌డ‌మే.

ఈ న్యూస్ తెలుసుకున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ మాత్రం త‌న‌దైన శైలిలో ఇదంత ప‌బ్లిసిటి స్టంటే అని కొట్టిపారేశాడు. ఇలా వ‌ర్మానే కాదు, బాలీవుడ్‌లో కూడ ఇది లీక్డ్ కాదు ప్రమోష‌న్ లీకింగ్ వీడియో అంటూ లైట్ తీసుకుంది. అంతేకాకుండా ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైయిలీలోనూ ఈ న్యూస్ గురించిన పెద్ద ఆర్టిక‌ల్ వ‌చ్చింది. అందులో ఫైన‌ల్‌గా ఏమ‌ని తేల్చారంటే బ‌హుశ ఇది ప్రమోష‌న్ స్టంట్ అయి ఉంటుంది. లీక్డ్ వీడియోకు సంబంధించి తెలిసిన నిజాల‌లో స‌రైన నిర్ధార‌ణ ఒక్కటీ లేదంటూ తేల్చిచెప్పింది. మొత్తంగా చెప్పాలంటే అంద‌రూ వీడియోను చూసి లైట్ తీసుకున్నారు త‌ప్పితే, పొర‌పాటున వ‌చ్చింద‌ని ఎవ‌రూ అనుకోవ‌డంలేదంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: