ప్రజాహితం కోసం జారీ చేసే ప్రక‌ట‌న‌ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరుగుతుంది. ఇదంత భార‌త ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ప్రతి సంవ‌త్సరం కండోమ్‌పై అవ‌గాన‌ను క‌లిగించేందుకు ఎన్నోర‌కాల యాడ్స్‌ను చిత్రీక‌రించి వాటిని జనాల్లోకి సులువుగా చేరేందుకు ప్రభుత్వం ప్రయ‌త్నిస్తుంది. ఈ యాడ్స్‌లో న‌టించేందుకు పెద్ద సెల‌బ్రిటి స్టార్‌లు కూడ క్యూ క‌డుతుంటారు. ఈ త‌ర‌హా యాడ్ షూటింగ్‌ల‌కు ప్రభుత్వం టెండ‌ర్లు వేసి కొన్ని యాడ్ ఏజెన్సీల‌కు అప్పగిస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు ఓ స‌రికొత్త కండోమ్ యాడ్ రెడీ కాబోతుంది. ఇందులో న‌టించేందుకు ప్రముఖ‌ బాలీవుడ్ యాక్టర్ రెడీ అయ్యాడు.

కాక‌పోతే రెమ్యున‌రేష‌న్‌ను మాత్రం భారీగా అడుగుతున్నాడంట‌. బాలీవుడ్ యాక్టర్ కం మోడ‌ల్ అర్జున్‌రాంపాల్‌ను కండోమ్ యాడ్ చేయాల‌ని ఏజ‌న్సీ సంప్రదించింది. ఈ ఘ‌నుడు మాత్రం ఆ యాడ్ కోసం దాదాపు 70 ల‌క్షల రెమ్మున‌రేష‌న్‌ను అడిగాడ‌ని బాలీవుడ్ స‌మాచారం. అర్జున్‌రాంపాల్‌కి అడిగినంత ఎమౌంట్‌ను ఇచ్చేందుకు ఆ ఏజెన్సీ కూడ అంగీక‌రించింది. దీంతో ఈ కండోమ్ యాడ్‌కు విప‌రీత‌మైన ప‌బ్లిసిటి వ‌చ్చేస్తుంది. కేవ‌లం ప్రజాహింత కోసం చేసే యాడ్ కోసం ఇంత ఖ‌ర్చు చేస్తున్నార‌ని కొంద‌రు పెద‌వి విరుస్తున్నా, యాడ్ జనాల్లోకి దూసుకుపోవ‌డం ఖాయం అని అంటుంది ఆ ఏజెన్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: