సున్నిత‌మైన క‌థాంశాల‌ను తెర‌కెక్కించి, బ్లాక్‌బాస్టర్ మూవీల‌ను సిల్వర్ స్క్రీన్‌కు అందించిన ఇండియ‌న్ క్రేజీ డైరెక్టర్ శంక‌ర్, త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్‌ను అదే రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నాడు. శంక‌ర్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ ఐ లో విక్రమ్‌ ప‌లుర‌కాల గెట‌ప్స్‌లో క‌నిపిస్తున్నాడు. చెన్నైలో జ‌రుగుతున్న వంద సంవ‌త్సరాల ద‌క్షిణ‌ భార‌తీల‌య చ‌ల‌న‌చిత్ర వేడుక‌ల‌కి విక్రమ్ అటెండ్ అయ్యాడు. అంద‌రూ విక్రమ్ గెట్‌ను చూసి సూప‌ర్బ్ అంటున్నారు. అంతగా విక్రమ్ గెట‌ప్‌ ఏముందనుకుంటున్నారా ? ఇంకేముంటుంది గుండు గెట‌ప్‌. విక్రమ్ ఐ మూవీలో గుండుతో క‌నిపించ‌బోతున్నాడు. శంక‌ర్ మూవీలో ఆఫ‌ర్ రావాలి కాని హీరో ఏ గెట‌ప్‌లోనైన క‌నిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు.

విక్రమ్ ఐ మూవీ కోసం హెల్త్ ప‌రంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఐ మూవీలోని క్యారెక్టర్ కోసం దాదాపు ప‌దిహేను కేజీల బ‌రువును త‌గ్గాడు విక్రమ్‌. కొన్ని నెల‌ల క్రితం ఐ మూవీకు సంబంధించిన‌ విక్రమ్ ఫోటోలు ప‌బ్లిష్ అయ్యాయి. ఇందులో విక్రమ్ చాలా స‌న్నగా క‌నిపించి అంద‌రినీ ఆశ్యర్యప‌రిచాడు. ఇప్పుటికే ఐ మూవీకు సంబంధించిన డైబ్బై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఇందులో విక్రమ్ స‌ర‌స అమీ జాక్సన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శంక‌ర్ తీసిన శివాజి మూవీలోనూ ర‌జ‌నీకాంత్‌ను గుండుతో చూపించాడు. ఇప్పుడు ఐ మూవీలో హీరో విక్రమ్‌ను గుండుతో చూపించ‌డంపై శంక‌ర్ గుండు ఫార్ములాను ఫాలో అవుతున్నాడ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: