విలక్షణమైన నటనతో విలక్షణమైన వ్యక్తిత్వం కూడా ఉన్న ప్రకాష్ రాజ్ ను ఇష్టపడనివారు ఉండరు. స్టేజ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి తరువాత టివి కళాకారుడు గా మారిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం దక్షిణ భారతదేశ సినిమాలలోనే కాదు బాలీవుడ్ లో కూడా పేరుగాంచిన నటుడు. ‘ధోని’ సినిమా ద్వారా ప్రకాష్ రాజ్ లోని మంచి అభిరుచి గల నిర్మాతను, దర్శకుడిని చూశాం. అటువంటి ప్రకాష్ రాజ్ త్వరలోనే హాలీవుడ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విచిత్రం ఏమిటంటే, ప్రకాష్ రాజ్ నటించే హాలీవుడ్ సినిమా ఒకటి కాదు రెండు హాలీవుడ్ సినిమాలలో ప్రకాష్ రాజ్ నటుడుగా కనిపిస్తాడు అట.

ఈ రెండు సినిమాలలో ఒకటి వికాస్ స్వరూప్ రాసిన ‘సిక్స్ సస్పెక్ట్’ నవల ఆధారంగా రూపొందుతున్న సినిమా అయితే రెండవది స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో రుపొందబోతున్న సినిమా అట. ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే స్పీల్ బర్గ్ ప్రకాష్ రాజ్ తో ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి మాట్లాడుకోవడం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులకు సంబంధించిన కధాంశం తో రూపొందించిన సినిమా స్పీల్ బర్గ్ తీస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక అవార్డు లు అందుకున్న ప్రకాష్ రాజ్ తన అద్వితీయమైన నటనతో హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: