అత్తారింటికి దారేది మూవీకు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప‌వ‌న్ మూవీకు జ‌రిగిన న‌ష్టానికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి కూడ ఊహించ‌ని మ‌ద్ధతు ల‌భించింది. ఇదిలా ఉంటే ఈ నెల చివ‌రి వారంలో ఫారిన్ షెడ్యూల్స్ జ‌రుపుకొనే కొన్ని క్రేజీ ఫిల్మ్స్ ప‌వ‌న్ మూవీను చూడాల‌ని, షూటింగ్స్‌ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇందులో మొద‌టి వ‌రుస‌లో ఉన్న టాలీవుడ్ హీరో నితిన్‌. నితిన్ అప్ క‌మింగ్ ఫిల్మ్ హార్ట్ ఎటాక్ మూవీ, స్పెయిన్ షెడ్యూల్ ఈ నెల 27 నుండి జ‌ర‌గాలి. అయితే అదే డేట్‌న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారుది మూవీ రిలీజ్ ఉండ‌టంతో ఆ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. డైరెక్టర్ పూరిజ‌గ‌న్నాధ్‌ను రిక్వెస్ట్ చేసి మ‌రీ షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారు. ఆ రోజు హార్ట్ ఎటాక్ మూవీ యూనిట్ అంతా అత్తారింటికి దారేది మూవీ మొద‌టి షోను చూస్తున్నారు.
అంతే కాకుండా టాలీవుడ్‌లో కొన్ని సినిమా షూటింగ్‌ల‌ను ఆ రోజు ఆపుకొని ప‌వ‌న్ అత్తారింటికి దారేది మూవీను చూడాల‌ని డిసైడ్ అయ్యాయి. ఈ విధంగా ప‌వ‌న్ మూవీ కోసం ప‌లు షూటింగ్‌లు సెల‌వ బాట ప‌ట్టాయి. ప‌వ‌నిజంలో మునిగితేలుతున్న హీరోలు అంద‌రూ ప్రసాద్ ఐమాక్స్‌లో స్పెష‌ల్ షోను వేయించుకుంటున్నార‌ని తెలిసింది. అప్పుడే అన్ని థియో ట‌ర్లలో ప‌వ‌న్ మూవీకు నాలుగు రోజుల అడ్వాన్స్ బుకింగ్‌లు న‌డుస్తున్నాయి.  కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: