ఎవరిపైనైనా సెటైర్లు వేయడంలో సిద్ధహస్తుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా అందరిపైనా తన ట్విట్టర్ లో సెటైర్లు వేసే వర్మ తనపై నిర్మించిన ఒక సెటైర్ సినిమా పేరును కూడా తట్టుకోలేకపోతున్నాడు అట. గాలి పీల్చినంత ఈజీగా ఎదుటి వారిని తన సెటైర్లతో హింసించే వర్మ, ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన ‘డాటర్ ఆఫ్ వర్మ’ సినిమా పేరువింటేనే భయపడిపోతున్నాడు అట. మొదటిగా ఈ సినిమా పేరును ‘డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’ అని పెట్టారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఖాజా,  మొదటిగా ఈ సినిమా విషయంపై వర్మ అనుమతి పొందడం, ఆయన జీవితం గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవడం జరిగింది అని అంటారు.

 మొదట్లో ఈ సినిమా విషయంలో వర్మ కూడా దర్శకుడు ఖాజా కు బాగానే సహకరించేవాడట. ఆ తరువాత ఈ దర్శకుడు వర్మ తో పనిచేసిన హీరోలను, హీరోయిన్స్ ను కలిసి వర్మ జీవితపు లోతులు తెలుసుకోవడం ప్రారంభించేసరికి వర్మ కు అసహనం పెరిగి ఈ సినిమా టైటిల్ వల్ల తన కుమార్తె ఇమేజ్ కి భంగం ఏర్పడుతుంది అనే వంకతో వర్మ ఈ సినిమా టైటిల్ ను ‘డాటర్ ఆఫ్ వర్మ’ గా మార్పించాడు అని అంటారు. ఆ తరువాత ఈ సినిమాలోని హీరో పాత్ర పేరును రామ్ గోపాల్ వర్మ పేరు బదులు గోపాల్ రావు గా మార్చడంలో కూడా వర్మ ఒత్తిడి ఎక్కువగానే ఉంది అనే వార్తలు వచ్చాయి. ఫస్ట్ కాపీ తయారు అయిపోయిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మార్చమని దర్శకుడు ఖాజా పై ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని వర్మ తన పరపతి ని అంతా ఉపయోగించి ప్రయత్నిస్తున్నాడు అనే టాక్ కూడా ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. యధార్ధాలు మాట్లాడుతాను, ముక్కు సూటిగా ఉంటాను అని కబుర్లతో బాకాలు ఊధె రామ్ గోపాల్ వర్మ ఒక్క చిన్న సినిమా దర్శకుడు తన జీవిత నేపధ్యంలో తీసిన సినిమాను కూడా వర్మ తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు అంటే అసలు ఈ సినిమాలో దర్శకుడు ఏమి చూపెట్టాడో అంటూ ఫిల్మ్ నగర్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ వ్యక్తినీ కనీసం దేవుడిని కూడా నమ్మను అని చెపుతూ, ఎంతటి ప్రముఖ వ్యక్తి పైన అయినా విమర్శలు గుప్పించే వర్మ, తన జీవితంపై సెటైర్ గా రూపొందించిన సినిమాను చూసుకోలేని స్థితికి వర్మ చేరాడు అంటే మన రామ్ గోపాల్ వర్మ అసలు రంగు ఇదే కాబోలు అని అనిపిస్తుంది.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: