వెండితెర మన్మధుడు అక్కినేని నాగార్జున ఈరోజు ఉదయం నుండి తన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫుల్ జోష్ మీద ఉన్నాడట. ఈమధ్య కాలంలో నాగార్జున అంత ఆనందంగా ఉండడం ఎవరూ చూడలేదు అని అంటున్నారు. నాగ్ ఇంత సంబరపడిపోవడానికి అత్తారింటికి దారేది సినిమాకు వచ్చిన సూపర్ హిట్ టాక్ కారణం అని అంటున్నారు.

తను ఆనందపడిపోవడమే కాకుండా తన ఆనందాన్ని పంచుకోవడానికి మీడియా ను పిలిచి మరీ హడావుడి చేసేశాడు నాగార్జున. పవన్ అత్తారింటికి దారేది సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని, పవన్ కు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఈ సినిమా నిర్మాత ప్రసాద్ కు అభినందనలు చెప్పడమే కాకుండా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత లెగ్ మహత్యం తో ఈ సినిమాకు కాసుల వర్షం కురుస్తుందని అంటూ సమంతను ఆకాశానికి ఎత్తేశాడట. రాజకీయ ఉద్యమాలు, సినిమా పైరసీ లు ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా అత్తారింటికి దారేది సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్న భవిష్యత్ ను సూచిస్తుందని నాగార్జున అభిప్రాయపడుతున్నారు.

నాగార్జున ఆనందం గురించి కొంచెం లోతుగా వెళ్లి ఆలోచిస్తే వచ్చే నెలలో విడుదల కాబోతున్న తన ‘భాయ్’ సినిమాకు ఇంక ఎటువంటి సమస్యలు ఉండవు అన్న ఆనందంతో నాగార్జున అత్తారింటికి దారేది సక్సెస్ ను పవన్ కన్నా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ మాటలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమాకు అడ్డంకులు తొలగి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లోని పెద్ద సినిమాలు అన్నింటికీ దారి దోరికినట్లుగానే అనుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: