కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సినిమా వాళ్లందరికీ ట్విటర్ ఒకటి తేరగ్గా దొరికింది. చీమ కుట్టినా, ఇంట్లో బూజు పట్టినా, పెరట్లో మొక్క ఎండిపోయినా, కూరలో ఉప్పు ఎక్కువైనా కూడా ట్విటర్లో ఆ సంగతి చెప్పేస్తున్నారు. పోనీలే, అందరికీ సెలెబ్రిటీలంటే క్రేజ్ ఉంటుంది కదా, అందుకే చెబుతున్నారు అని వదిలేయవచ్చు. కానీ కొందరు హద్దలు దాటి అనవసరమైన రాతలు రాస్తున్నారు. అదే ఇబ్బంది. 

కొందరు కుర్రహీరోలు ట్వటిర్లో ప్రతిదానికీ తమ స్పందనలు తెలియజేస్తుంటాయి. చేస్తే చేశారు... కాస్త డీసెన్సీ మెయింటెయిన్ చేయాలి కదా! ఎమోషనల్ అయిపోయి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ని యూజ్ చేసేస్తారు. దానివల్ల అందరికీ కాస్త ఇబ్బందే. అలా ఇబ్బంది పెట్టేవారిలో అల్లు శిరీష్ ఒకడు. ఈయనగారు ప్రతిదానికీ ఆవేశపడిపోతుంటాడు. హద్దులు దాటి కామెంట్ చేస్తుంటాడు. ఎవరో ఒకరిని ఏదో ఒకటి అని వారికి కోపం తెప్పిస్తుంటాడు. అతడి గిల్లుడికి చాలామందికి ఒళ్లు మండిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి నిన్న ట్విటర్ నుంచి మాయమైపోయాడు. ఎందుకిలా సడెన్ గా అకౌంట్ ను కత్తిరించాడు అని చాలామందికి అనుమానం వచ్చింది. దానికి కారణం అతడి తండ్రి అల్లు అరవింద్, అన్న అర్జున్ లే అని తాజాగా తెలిసింది.

ట్విటర్లో శిరీష్ రాతలు చూసి అల్లు అరవింద్ కి చాలా కోపం వచ్చిందట. మరీ స్పీడెక్కువయ్యింది, కాస్త తగ్గించు అని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడట. అయినా మనోడు వినలేదు. హీరో అయ్యాక ఇప్పుడైనా నీ పద్ధతి మార్చుకో అని స్వయంగా అన్న బన్నీ చెప్పినా కూడా మనోడు తగ్గలేదు. దాంతో వాళ్లిద్దరికీ మండి, ఫుల్లుగా కోటింగ్ ఇచ్చారట. ట్విటర్లో రాతలు రాయడం తప్పు కాదు, కానీ కంట్రోల్ తప్పి రాయడం మాత్రం కెరీర్ కి మంచిది కాదు, ఇక ట్వటిర్ జోలికి పోతే బాగుండదు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారట. అందుకే అర్జున్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అదీ అసలు సంగతి!

మరింత సమాచారం తెలుసుకోండి: