ఈ మధ్య కనిపించిన వారిదగ్గరల్లా సమంత పురాణం పాడుతున్నారు సుహాసిని, మణిరత్నం. వరుస ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నం కడలి అనే సినిమా చేయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సమంతను సంప్రదిస్తే వెంటనే ఒప్పుకుంది. కానీ తన అనారోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే మణిరత్నంకు ఫోన్ చేసి ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నానన్న విషయాన్ని సున్నితంగా చెప్పిందట. ఆ రోజు సమంత అలా చెప్పడం వల్లే తాము మరో నాయికను ఎన్నుకుని ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేసుకోగలిగామని చెప్తున్నారట ఆ దంపతులు. సమంతకు ఎవరు రుణపడుతారో లేదోగానీ రాధ తప్పకుండా ధన్యవాదాలు చెప్తుంది. ఎందుకంటే సమంత తప్పుకోబట్టే కదా తన చిన్న కూతురు తులసికి మణిరత్నం అంత గొప్ప దర్శకుడి సినిమాలో తొలి అవకాశం దక్కింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: