అత్తారింటికి దారేది మూవీ యు.ఎస్‌లోనూ క‌లెక్షన్స్ జోరు కురిపించింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఇండియ‌న్ బాక్సాపీస్ వెల్లడించింది. ఇదంతా తాజా న్యూన్ రిపోర్ట్స్ అంటూ అంద‌రూ తేల్చారు. దాదాపు అర‌వై అయిదు స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన అత్తారింటికిదారేది మూవీ, యు.ఎస్‌లోనూ భారీ క‌లెక్షన్ష్‌ను కొల్లగొట్టింది. యు.ఎస్‌లో అర‌వై శాతం మంది లీక్డ్ మూవీను చూసిన‌ట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయినా ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స ఏ మాత్రం త‌గ్గలేదు. నాలుగు రోజుల పాటు యు.ఎస్‌లోని అన్నీ స్క్రీన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. యు.ఎస్ మొద‌టి రోజు క‌లెక్షన్స్ 2.17 కోట్లును కొల్లగొట్టడంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడ ప‌వ‌న్ క‌లెక్షన్స్‌కు అవాక్కయింది. బాలీవుడ్ మూవీలకూ ఇప్పటి వ‌ర‌కూ ఇంత క‌లెక్షన్స్ రాలేదు.అందుకే అత్తారింటికిదారేది యు.ఎస్ క‌లెక్షన్స్ రికార్డ్స్ బాలీవుడ్ బాక్సీపీస్ వ‌ర‌కూ వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: