ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది అమెరికా క‌లెక్షన్స్ ఓ రేంజ్‌లో దూసుకు వెళుతుంది. సాధారణంగా తెలుగు మూవీల‌కు ఓవ‌ర్‌సీస్ మార్కెట్ అనేది ఆక్సీజెన్ లాంటిది. అక్కడ చెప్పుకోద‌గ్గ క‌లెక్షన్స్ వ‌స్తే నిర్మాత‌ల‌కు డ‌బ్బులు మిగిలిన‌ట్టే. అలాంటిది అత్తారింది దారేది మూవీకు యు.ఎస్ లో విప‌రీత‌మైన క‌లెక్షన్స్ వ‌ర్షం కురుస్తుంది. ప‌వ‌న్ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ మొత్తం క‌లిపితే దాదాపు 5.77 కోట్లును కొల్లగొట్టింది. అంటే ఆరు కోట్ల మార్క్ వ‌ర‌కూ చేసుకోగ‌లిగింది. అర‌వై అయిదు స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది మూవీ ఇప్పటికీ హౌస్‌పుల్ క‌లెక్షన్స్‌తోనే ఆడుతుంది.

ఈ స్పీడ్ ఇలాగే కొన‌సాగితే ఈ మూవీ వారంలో రోజుల్లో ప‌ది కోట్లను కొల్లగొట్టడం అనేది ఖాయం అని అంద‌రూ అంటున్నారు. ఇండియ‌న్ ఫిల్మ్ బాక్సాపీస్ క‌లెక్షన్స్‌ను చెప్పే త‌రుణ్ ఆద‌ర్శ్ కూడ ఇదే విషయాన్ని వెల్లడించాడు. అత్తారింటికిదారేది మూవీ మైండ్ బ్లోయింగ్ క‌లెక్షన్స్ అంటూ చెప్పాడు. యు.ఎస్ లో మొద‌టి రోజు 2.17 కోట్లు వ‌సూల్ కాగా, రెండో ఆ క‌లెక్షన్స్ మ‌రింత పెరిగాయి. మొత్తానికి ప‌వ‌న్ మానియా విదేశాల్లో కేక పుట్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: