మంచు ఫ్యామిలి హీరో మంచు విష్ణు న‌టించిన దూకుకెళ్తా మూవీ ఆడియో ఫంక్షన్ నిన్న సంద‌డి సంద‌డిగా జ‌రిగింది. ఆడియో ఫంక్షన్‌లో యాంక‌ర్ల హ‌డావిడి, డ్యాన్సర్లు హోరు, కాంట్రవ‌ర్సీ స్పీచ్‌లు, భ‌రించ‌లేని సోది లాంటివి లేకుండా చాలా సింపుల్‌గా జ‌రిగిపోయింది. ఇది ఆడియో ఫంక్షన్ కంటే మంచు ఫ్యామిలి ఫంక్షన్ అన‌డ‌మే క‌రెక్ట్ అంటున్నారు. దూసుకుకెళ్తా ఆడియో ఫంక్షన్‌లో యాంక‌ర్ రోల్‌ను మంచుల‌క్ష్మీనే తీసుకుంది. దీంతో యాంక‌ర్ అవ‌స‌రం లేకుండానే పోయింది.

మ‌ధ్యలో మంచు మ‌నోజ్ అక్కపై సెటైర్లు,  ప్యామిలి గురించి పొగ‌డ్తులతోనే ఫంక్షన్ అల్లరిఅల్లరిగారూ,సంద‌డిగానూ మారింది. ఈ ఫంక్షన్‌కు వ‌చ్చిన సెల‌బ్రిటీలంతా మోహ‌న్‌బాబు,మంచు ప్యామిలితో సంబంధం ఉన్న వాళ్ళే క‌నిపించారు. ఒక్క దాస‌రినారాయ‌ణ రావు త‌ప్పితే మిగ‌తా వారంత స్పీచ్‌ను క్యాజువ‌ల్‌గా ముగించారు. దాస‌రినార‌ణ‌రావు ఎప్పటి లాగే ద‌ర్శకుల‌ను ఆకాశానికి ఎత్తేస్తూ, కొంత ఆవేశ‌పూరిమైన స్పీచ్ ఇచ్చాడు. మిగ‌తాదంతా మంచు ప్యామిలి ఫంక్షన్‌లా మారిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: