తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను చూసి వెరైటీగా స్పందించారు. నిన్న ఆదివారం తన ‘బాహుబలి’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ అత్తారింటికి వెళ్ళాడట రాజమౌళి. ఈ సినిమా గొప్పతనాన్ని తన ట్విటర్ లో మూడు వాక్యాల్లో రాశాడు రాజమౌళి. ఈసినిమాను చూస్తున్నంతసేపు ప్రతి సీన్ లోను పవన్ త్రివిక్రమ్ ల అద్భుతమైన టేలెంట్ తనకు కనిపించిందనీ తన ట్విటర్ లో ట్విట్ చేసారు రాజమౌళి.

ఈ మాటలు ప్రతి వ్యక్తి చెప్పేవె అయినా ఒక అద్భుతం గురించి చెపుతున్నప్పుడు అందరు ఇంచుమించు గా ఒకేలా చెప్పవలసి వస్తుందనీ అంటు పవన్ అత్తారిల్లు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అనే విషయాలు గురించి ఆలోచించే కంటే, ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థుతులలో తెలుగు సినిమాకు దారి చూపిన సినిమాగా పవన్ ‘అత్తారింటికి దారేది’ చరిత్రలో నిలిచి పోతుంది అని వ్యాఖ్యానించడమే కాకుండా ఒక మంచి కుటుంబ సినిమాను ప్రస్తుతు పరిస్తులలో తీసిన ఘనత త్రివిక్రమ్ హీరో పవన్ లకు మాత్రమే వచ్చితీరుతుందని అభిప్రాయ పడ్డాడు రాజమౌళి.  టాలీవుడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈసినిమా 60 కోట్లు పైనే వసూలు చేస్తుందని అంటున్నారు ..  

మరింత సమాచారం తెలుసుకోండి: