రాజ‌మౌళీ మూవీలో ఏ హీరో చేసినా ఆదేదో జాబ్ చేస్తున్న ఫీలింగ్ వ‌స్తుంది. హీరో అంటే నాలుగు డైలాగులు, హీరోయిన్‌తో చిందులు, కుద‌రితే రెండు కుళ్ళు జోకులు చెబితే స‌రిపోదు. అస‌లైన హీరోయిజం అంటే ఏంటో చూడాలంటే రాజ‌మౌళీ మూవీలో హీరో వేషం వేస్తే తెలుస్తుంది. ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నాడు టాలీవుడ్ క‌టౌట్ హీరో ప్రభాస్‌. ప్రభాస్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ బాహుబ‌లి మూవీ కోసం గుర్రపు స్వారి చేస్తున్నాడు. రాజ‌మౌళి ద‌గ్గర ఉండి గుర్రపు స్వారి మెళుకువ‌లు చెబుతున్నాడు. ప్రభాస్ గుర్రంపై ఉన్న ఈ ఫోటో ఇంట‌ర్నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

సాధార‌ణంగా రాజ‌మౌళీకు హార్స్ రౌడింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే త‌న మూవీలోని హీరోల‌కు హార్స్ రైడింగ్ రాక‌పోయినా, ఏదోక సంద‌ర్భంలో ఆ స‌న్నివేశాల‌ను పెట్టాల‌ని రాజ‌మౌళి అనుకుంటాడు. అయితే బాహుబ‌లి మూవీలో హార్స్ రైడింగ్ అనేది క‌థ‌లోని భాగ‌మే కాబ‌ట్టి ప్రభాస్, రానాకి హార్స్ రైడింగ్‌పై స్పెష‌ల్ ట్రైనింగ్‌ను కూడ ఇప్పించాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా అనుష్క చేస్తుంది. గుర్రంపై ప్రభాస్ క‌నిపించ‌డంతో అభిమానులు ఆనందంతో ఖుషి అవుతున్నారు. కొంత మందైతే గుర్రం మీద ప్రభాస్‌ను చూస్తుంటే అస‌లైన మ‌గ‌ధీరుడుగా ఉన్నాడంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: