ప్రముఖ దర్శకుడు లేటెస్టుగా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకున్నాడట, ఎలాగైనా ఆయనను ఒడిసి పట్టుకుని ఓ హిట్టు కొట్టాలన్నదే ఆయన టార్గెట్ అంటూ టాలీవుడ్ టాక్.

ఇప్పటికే ‘అత్తారింటికి దారేది’ సక్సెస్ తో మహా రంజుమీద ఉన్న త్రివిక్రమ్ తో సినిమా తీసేందుకు మహేష్ బాబు, రాంచరణ్ వంటి వారు కూడా రెడీగా ఉన్న తరుణంలో వారిని కాదని, ఆయన జోలికి రాని యంగ్ టైగర్ వెంట త్రివిక్రమ్ పడ్డాడెందుకా అన్న సందేహాలు అందరికి రావడం సహజమే.

ఎన్టీఆర్ ఎంత ఎనర్జిటిక్ హీరోనో అందరికి తెలిసిందే, పైగా ఆయన యాక్షన్ ప్రధానపాత్రలు పోషిస్తానంటాడు, సినిమాలో ఎక్కువ ట్విస్టులు కూడా కోరుకోడు, పవన్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో లెక్కకు మించి ట్విస్టులు పెట్టిన త్రివిక్రమ్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తీసి హిట్టుకొట్టాలంటే జూనియరే బెటర్ అంటూ ఆయన వెంట పడ్డాడు అంటున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ తో ప్రాథమిక సంబాషణ కూడా అయిందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: