గత శుక్రువారం విడుదల అయిన అత్తారింటికి దారేది టాలీవుడ్ లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఈ సినిమా దర్శకనిర్మాతలు కూడా ఉహించనంత మెగా హిట్ రేంజ్ కి అత్తరిల్లు చేరిపోతోంది. ఈ ఆనందం నుండి పవర్ స్టార్ అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ తరుణంలోనే మరో హాట్ న్యూస్ టాలీవుడ్ లో సందడి చేస్తోంది. పవన్ తన అత్తరిల్లు ఇచ్చిన జోష్ తో తన గబ్బర్ సింగ్-2 కు ముహూర్తం నిర్ణయి౦చాడు అని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాను నిర్మిస్తున్న పవన్ ప్రియస్నేహితుడు శరత్ మరార్ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను లాంచనంగా రాబోతున్న విజయదశమి నాడు ప్రారంభించబోతున్నారు అన్న వార్త ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

ఈ సినిమా ప్రారంబోత్సవానికి పవన్ కళ్యాణ్ కూడా పచ్చ జెండా ఉపాడని టాక్. సమయం తక్కువగా ఉండడంతో ఆ సమయానికి హీరోయిన్ ఎంపిక పై సంపత్ నంది పవన్ కళ్యాణ్ రకరకాల పేర్లు పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఒక వేళ హీరోయిన్ ఎంపిక ఆలస్యం అయినా మంచి రోజును దృష్టిలో పెట్టుకొని విజయదశమి నాడే గబ్బర్ సింగ్-2 కు క్లాప్ కొట్టడానికి సంపత్ నంది నిర్మాత శరత్ మరార్ మొగ్గుచూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతి హసన్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మార్చిన పవన్, అత్తారింటికి దారేది సినిమా ద్వారా ప్రణీత కు గోల్డెన్ లెగ్ ఇమేజ్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.

ఈ గబ్బర్ సింగ్-2 ద్వారా ఏ హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పవన్ మార్చబోతున్నాడు అంటూ టాలీవుడ్ పరిశ్రమ, పవన్ అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా గబ్బర్ సింగ్-2 హీరోయిన్ విషయంలో ఎవరూ ఉహించని హీరోయిన్ పవన్ తో జతకడుతుంది అనే వార్తలు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, ఫైట్స్ డిజైనర్ గా రకరకాల అవతారాలలో పవన్ ను చూసిన పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమా ద్వారా రచయిత గా పవర్ స్టార్ ను చూడబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ తన గబ్బర్ సింగ్-2 హీరోయిన్ గురించి వెయిట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: