ఇండియ‌న్ ఫిల్మ్‌ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ సిల్వర్ స్ర్రీన్‌ను వేడిక్కించిందంటే ఆ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద కాసులు వ‌ర్షమే. అయితే అది వ‌ల్గారిటీను మించ‌కూడ‌దు, వ‌య్యారానికి త‌గ్గకుడ‌దు. ఆ విధంగా స్టోరీలోనూ, గ్లామ‌ర్‌లోనూ స‌రైన ప‌ట్టు ఉంటే ఆ మూవీలకి స‌క్సెస్ అనేది చిన్న విష‌య‌మే. ఈ మ‌ధ్య కాలంలో ఈ విధ‌మైన‌ గ్లామ‌ర్ ఓరియంటెడ్ మూవీలు ఇబ్బడిముబ్బడిగా వ‌స్తున్నాయి. ఏ మూవీ చూసిన మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌ను చూపిస్తున్నారు. క‌థే లేకుండా గ్లామ‌ర్‌తోనే కొట్టుకెళ్ళటానికి ప్రయ‌త్నిస్తున్నారు. దాంతో మూవీలు బాక్సీపీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డుతున్నాయి.

ఆ విధంగా వ‌చ్చిన మూవీల్లో పాకిస్థానీ డ‌ర్టీ సెల‌బ్రిటి వీనామాలిక్ కూడ ఉన్నారు. వీనామాలిక్ లేటెస్ట్ ఫిల్మ్ సూప‌ర్‌మోడ‌ల్ మూవీ రిలీజ్ అయి బాక్సాపీస్ వ‌ద్ద బోరుమంటుంది. వీనామాలిక్ అందాల‌ను టార్గెట్ చేసుకొని వ‌చ్చిన ఈ మూవీకు ప్రేక్షకుల ఆధ‌ర‌ణ క‌రువు అయింది. వీనామాలిక్ గ‌త చిత్రం జింద‌గీ 50-50 లోనూ బాక్సీపీస్ వ‌ద్ద ఇవే ఫ‌లితాల‌ను చూసింది. జింద‌గీ 50-50 మూవీలో వీనామాలిక్ అందాలు క‌లెక్షన్స్ కురిపిస్తాయ‌నుకుంటే ఆ మూవీ ప్లాప్ అయింది. ఇప్పుడు సూప‌ర్ మోడ‌ల్ మూవీ కూడ ప్లాప్ అయింది. రెండు మూవీల్లోనూ వీనామాలిక్ వీర ఎక్స్‌పోజింగే. అయినా క‌లెక్షన్స్ నిల్‌. దీంతో వినామాలిక్‌తో రోమాన్స్ అంటేనే ప్రొడ్యూజ‌ర్స్‌కు వ‌ణుకు వ‌స్తుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: