స‌మంత మాయలో టాప్ హీరోల నుండి చో టా హీరోల వ‌ర‌కూ అంద‌రూ క్యూ క‌ట్టాల్సిందే. అంత‌గా ఈ బ్యూటీ అంద‌రిని మాయ చేస్తుంటుంది. అలాగే ఇప్పుడు డైరెక్టర్స్‌ను కూడ మాయ చేస్తుంది. ఓ డైరెక్టర్ అయితే స‌మంత‌కు కంప్లీట్‌గా బౌల్డ్ అయ్యాడు. స‌మంత  చేసిన ప‌నులే త‌న‌కు ఎప్పుడూ గుర్తకువ‌స్తున్నాయంట‌. ఆ డైరెక్టరే మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది ఫిల్మ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో, ఈ మూవీ స‌క్సెస్‌కు స‌మంత రో ల్ కూడ చాలా ప్లస్ అయింద‌ని అంటున్నాడు. అంతే కాకుండా ఈమె గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతున్నాడు. 

ఓ టీవి షోకు  ఇచ్చిన ఇంట‌ర్వూలో స‌మంత గురించిన త్రివిక్రమ్ ఈ విధంగా అన్నాడు. ‘సెకండాఫ్ లో సమంత పవన్ దగ్గరికి వెళ్లి ఓ ముద్దు పెట్టి బావా అని పిలవాలి. కానీ సమంత సెట్ లో అక్కడికక్కడ ఇంప్రవైజ్ చేసి నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేసింది. నేను కట్ చెప్పకుండా అలా చూస్తుండిపోయాను. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అంతే కాకుండా స‌మంత కూడ ద‌ర్శకుల‌తో చాలా ప్రీగా ఉంటోంది. ఏం కావాలో అడిగి చేయించుకోండి అంటూ మోహ‌మాటం లేకుండా చెబుతుంది. హీరోల‌తో అయితే ఆ కెమిస్ట్రీ గురించి ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. హీరోల ప‌క్కనే ఉంటూ హీరో న‌ట‌న‌కు ఏ విధమైన  ఎక్స్‌ప్రెష‌న్స్ కావాలో వాటిని అడిగి మ‌రీ ఇస్తుందంట‌. దీంతో స‌మంత మాయ‌లో హీరోల‌తో పాటు, డైరెక్టర్లు ప‌డిపోతున్నార‌ని టాలీవుడ్ అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: