మ‌ల‌యాళ హీరోయిన్ కేథ‌రిన్ థెరిస్సాకి గుడ్ టైం స్టార్ట్ అయిన‌ట్టే . మొన్నటి వ‌ర‌కూ ఆఫ‌ర్ల కోసం తిర‌గని ఆఫిస్ లేదు, క‌ల‌వ‌ని హీరో లేడు. మొత్తనికి కోళీవుడ్ ఇండ‌స్ట్రీ ఈమెను క‌రుణించింది. హీరో కార్తి స‌ర‌స‌న‌ ఒక ఫిల్మ్‌లో చేసేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్ కూడ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో కేథ‌రిన్ త‌మిళ‌నాట త‌న అదృష్టాన్ని చూడ‌బోతుంది. కార్తితో న‌టించిన మూవీ హిట్ అయితే, ఈ బేబికూ ఇక ఆఫ‌ర్లే ఆఫ‌ర్లే. ఎన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చినా తెలుగు నుండి మూవీలు వ‌స్తే నేను త‌ప్పకుండా చేస్తాను అని అంటుందో. కేథ‌రిన్ నోరు విప్పి తెలుగు లో మూవీలు చేస్తాను అని అంటున్నా, ఇక్కడ మాత్రం ఇచ్చేవాళ్ళు క‌రువ‌య్యారు. 

అందుకే టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు మ‌రో ఆఫ‌ర్ ఇచ్చింది. నా మూవీల‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకుంటాను అని అంటోంది. ‘నేను స్వతహాగా కేరళ అమ్మాయిని కాని నాకు మలయాళం రాదు, అలాగే తెలుగు కూడా రాదు. నేను చేసిన సినిమాలకు వేరొకరు డబ్బింగ్ చెప్పడం వల్ల ఒరిజినల్ ఫీల్ కరెక్ట్ గా రావడం లేదు అందుకే నేను ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలోనే నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని విన‌యంగా చెప్పింది. దీంతో మంచి తెలుగును నేర్పించే టీచ‌ర్‌ను చూడ‌మ‌ని కేథ‌రిన్ మేనేజ‌ర్‌కు చెప్పింద‌ట‌. అయినా టాలీవుడ్ హీరోల‌తో ఎఫైర్స్ న‌డిపిన కేథ‌రిన్‌కు దాదాపు స‌గం తెలుగు వ‌చ్చిందట‌. మిగ‌తా స‌గం కోసం ఈ తంటాలు ప‌డుతుంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: