ప్రియాంక‌చోప్ర రోజురోజుకి రెచ్చిపోతుంది. మొన్నటి వ‌ర‌కూ నో ఐటెం సాంగ్స్ అంటూ, ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్‌ను చుల‌క‌న‌గా చూసిన ఈ గ్లామ‌ర్ బ్యూటి ఇప్పుడు వ‌రుస పెట్టి ఐటెం సాంగ్స్ చేస్తుంది. ఐటెం సాంగ్ ఉంద‌ని ప్రియాంక‌చోప్రకు చెబితే చాలు మిగ‌తాది అంతా త‌నే చూసుకుంటుంది. కాస్ట్యూమ్స్ నుండి స్కిన్ పై టాటో వ‌ర‌కూ ప్రతిదీ ప్రియాంక సెల‌క్షన్స్ మీదే ఫైన‌ల్ జ‌ర‌గుతుంది. దీపికాప‌దుకొనె అప్‌క‌మింగ్ ఫిల్మ్ రామ్‌లీలా మూవీలో ప్రియాంచ‌చోప్ర ఐటెం సాంగ్ చేస్తుంది. ఇందులోని కాస్ట్యూమ్స్ తో ప్రియంక వేడెక్కిస్తుంది. ఇప్పటి వ‌ర‌కూ ప్రియాంక రెండు ఐటెం సాంగ్స్‌లో చేసింది. ఆ రెండింటిలో కంటే ఇప్పుడు రాబోతున్న ఈ ఐటెం సాంగ్ కెవ్వుకేక‌ పుట్టించ‌బోతుంది.

ఈ ఐటెం సాంగ్‌ షూటింగ్ జంజీర్ షూటింగ్ స‌మ‌యంలోనే జ‌రిగింది. అయితే జంజీర్ షూటింగ్ స‌మ‌యంలో షూటింగ్‌కి వస్తాన‌ని చెప్పి రెండు రోజులు ఎవ‌రికి, ఏకార‌ణం చెప్పకుండా డుమ్మా కొట్టేసింది. ఆ రెండు రోజుల్లో రామ్‌లీలా ఐటెం సాంగ్ షూటింగ్‌లో పార్టిసిపెట్ చేసింది. ఈ విష‌యంలో రామ్‌చ‌ర‌ణ్ ప్రియాంక‌ను ఎక్కడ‌కు వెళ్ళారు అని ఆడిగితే, ఏమి లేదులే అని చెప్పిందట‌. ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తు ప్రియాంక వెళ్లింది ఐటెం సాంగ్ షూటింగ్ అని తెలియ‌డంతో, ప్రియాంక చాలానే సీక్రెట్స్ మెయింటెన్ చేస్తుంద‌ని అని చ‌ర‌ణ్ డిసైడ్ అయ్యాడు. ప్రియాంక ఐటం సాంగ్ ఫ‌స్ట్ లుక్‌పై బాలీవుడ్ నుండి వేడి వేడి కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ ఐటెం సాంగ్ ఖ‌చ్చితంగా వేడెక్కిస్తుంద‌ని అంటుంది బాలీవుడ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: