పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చాలెంజ్ చేస్తోంది ఓ ప్రముఖ హీరోయిన్, అది కూడా విడుదలయి హిట్టు టాక్ వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాకే చుక్కలు చూపిస్తానంటోందట. పవన్ తో స్టార్ హీరోలే చాలెంజ్ కు దిగరు, ఏకంగా ఓ హీరోయిన్ ఈ పనిచేస్తోందంటే సంచలనమే కదా.

ఆమె ఎవరో కాదు ప్రియమణి, తను ప్రధానపాత్రగా నటించిన ‘చండీ’ సినిమా అక్టోబరు 4వ తేదిన విడుదలవుతోంది. అత్తారింటికి దారేది విడుదలకు వారం రోజుల తేడాతోనే తను వచ్చే ధైర్యం చేస్తోందంటే పవన్ తో సినిమా హిట్టు, కలెక్షన్ల విషయంలో చాలెంజ్  చేస్తున్నట్టే అంటున్నారు.

ఈ సినమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో ప్రధాన పాత్ర జగన్నాథనాయుడు పాత్రంలో రెబెల్ స్టార్  కృష్ణం రాజు నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్నో డేరింగ్ యాక్షన్ సీన్లలో ప్రియమణి అదరగొట్టిందట. మరో ఆరు రోజుల తేడాతో యంగ్ టైగర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా అక్టోబరు 10న విడుదలవుతోంది. రెండు భారీ సినిమాల మద్య వస్తున్న ప్రియమణి రికార్డు సృష్టిస్తుందా, లేక చిత్తవుతుందా చూడాలి మరి అంటున్నారు టాలీవుడ్ లో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: