మీడియా ను మేనేజ్ చేయడం ఒక కళ. రాజకీయ నాయకులనైనా అలాగే ఫిల్మ్ సెలబ్రిటీలనైనా రకరకాల చిత్ర విచిత్ర ప్రశ్నలతో ఇరుకున పెట్టడం మీడియా కు వెన్నతో పెట్టిన విద్య. ఈ రీతిలోనే ఈ మధ్య బాలీవుడ్ మీడియా కంటపడిన రణబీర్ కపూర్ ను మీడియా వ్యక్తులు రకరకాల ప్రశ్నలతో చుట్టుముట్టారు. ఈ మధ్య రణబీర్, కత్రినా కైఫ్ లకు సంబంధించి వారి ప్రైవేటు హాలీ డే స్పాట్ ఫోటోలు మీడియా కు లీక్ కావడంతో అప్పటి నుంచి మీడియా పై చాలా గుర్రుగా ఉంటున్నాడు మన బాలీవుడ్ మిల్కీ బాయ్. ఈ సందర్భంలోనే ఎదురుపడ్డ మీడియా మిత్రులు రణబీర్ ను తన 31 వ పుట్టిన రోజుకు రణబీర్ ప్రేయసి కత్రినా ఏ విలువైన బహుమతి ఇచ్చింది అంటూ ప్రశ్నించే సరికి మన బాలీవుడ్ మిల్కీ బాయ్ కి దిమ్మతిరిగిన కోపం వచ్చి ‘మైండ్ యువర్ వోన్ బిజినెస్’ అంటూ చిందులు వేశాడట రణబీర్.

ప్రధానమంత్రి కి కోపం వస్తేనే లెక్క చేయని మీడియా వర్గాలు, రణబీర్ కోపాన్ని లెక్క చేయక మళ్ళీ ప్రేయసి కత్రినా తో మీ డేటింగ్ హాలీ డే ఎప్పుడు..? అని ప్రశ్నిస్తే, దానికి విసురుగా ఆ హాలీ డే కి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతాయి కదా...? అప్పుడు తెలుస్తుంది అంటూ విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడట రణబీర్. ‘రాజ్ నీతి’ సినిమా తరువాత వరసపెట్టి సినిమాలు చేస్తున్న కత్రినా- రణబీర్ ల మధ్య ఏదో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న నేపధ్యంలో రణబీర్ కోపాన్ని బాలీవుడ్ మీడియా పట్టించుకోదు కదా..! ఈ విషయం పాపం మన బాలీవుడ్ మిల్కీ బాయ్ కి తెలియదు కాబోలు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: