అత్తారింటికి దారేది చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. పైగా వాళ్లలో ఒకరు సమంత. ఈ క్యూటీతో పాటు ప్రణీత కూడా హాట్ గా కనిపించి పిచ్చెక్కించింది. అయినా కూడా వాళ్లిద్దరినీ మానేసి, వాళ్ల తల్లిగా నటించినామె వైపు ప్రేక్షకులు చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆమె ఎంత గ్లామరస్ గా, అట్రాక్టివ్ గా ఉందో. అందుకే ఇప్పుడు అందరి కళ్లూ నదియా మీదే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ కి అత్తగానే చేసినా హీరోయిన్ గా చేసినంత పేరు వచ్చింది నదియాకి. ఒకనాటి ఈ అందాల తార మధ్యలో చాలాకాలం కనిపించలేదు. ఆ తర్వాత సడెన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లిళ్లు చేసుకుని సెటిలై మళ్లీ వచ్చే నటీమణులు ఎలా ఉంటారో మనకు తెలియంది కాదు. లావైపోయి, రంగు తగ్గిపోయి, కళను కోల్పోయి ఉంటారు. కానీ నదియా అలా లేదు. కత్తిలాంటి ఫిజిక్ తో, చూడగానే పడవేసేంత అందంగా ఉంది. అందుకే ఏకంగా పవన్ కళ్యాణ్ కే అత్తయిపోయింది. ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పేసుకుంది.

నిజానికి మిర్చి సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించినప్పుడే అందరికీ నచ్చేసింది నదియా. ఇప్పుడు వపన్ కి అత్తగా కూడా సూపర్బ్ గా సెట్టయ్యే సరికి ఇక ఆమెకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. స్టార్ హీరోలకు తల్లి, అత్త పాత్రలకు ఈ గ్లామరస్ లేడీని పెట్టేయాలని దర్శకులంతా తెగ ఉబలాటపడుతున్నారు. ఈ లెక్కన నదియాకి కొన్నేళ్ల పాటు చేతినిండా పనే!

మరింత సమాచారం తెలుసుకోండి: