ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో అత్యంత భారీ సినిమాలకు చిరునామాగా యోగ బ్యూటీ అనుష్క మారింది. ఈ నవంబర్ 1 న విడుదల కాబోతున్న ‘వర్ణ’ తో పాటు ప్రస్తుతం సెట్స్ పై నిర్మాణం జరుపుకుంటున్న ‘బాహుబలి’, ‘రాణి రుద్రమ’ సినిమాలు అనుష్కను టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మార్చాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో  అనుష్కను తమ సినిమాలలో నటింప చేయడానికి చాలామంది టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అత్యంత భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ మన జేజెమ్మ ను మొహమాట పెడుతున్న ఏ ఒక్క సినిమాకు కూడా అనుష్క సంతక౦ పెట్టను అని తెగేసి చెపుతోందట. దీనికి ప్రధాన కారణం రాజమౌళి, గుణ శేఖర్ సినిమాలే అని అంటున్నారు.

ఒక సినిమాలో రాజకుమారిగా, మరొక సినిమాలో మహారాణిగా నటిస్తూ ఆ పాత్రకు తగ్గట్టుగా శరీర సౌష్టవాన్ని మార్చుకుంటూ తన డేట్స్ ను కూడా ఆ విధంగానే బాహుబలి, రాణి రుద్రమ సినిమాలకు సర్దుబాటు చేస్తున్న అనుష్క ఈ రెండు సినిమాల షెడ్యుల్స్ పూర్తి చెయ్యడానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల వరకూ కాలం పడుతుంది కాబట్టి ఈలోపున మరో సినిమాను ఈ మధ్యలో ఒప్పుకొని లేని సమస్యలు తెచ్చుకోవడం అనుష్క కు ఇష్టం లేదట. అందువల్లనే నిర్మాతలు ఎంతటి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నా యోగ బ్యూటీ నో అంటోంది అనే వార్తలు వస్తున్నాయి. కాని హీరోయిన్ ల కెరియర్ కాల పరిమితి చాలా చిన్నది గా ఉంటుంది కాబట్టి ఇప్పటికే 30 ఏళ్ళు ధాటిపోయిన మన జేజెమ్మ వచ్చిన అవకాశాలు జారవిడుచుకు౦టోంది అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: