బాలీవుడ్ బాక్సాఫీసుతో ఆడుకుంటాడు సల్మాన్ ఖాన్. రికార్డులు క్రియేట్ చేయడం, వాటిని బ్రేక్ చేసి మళ్లీ కొత్త రికార్డులు సృష్టించడం చాలా ఈజీ మనోడికి. అందుకే నిర్మాతలు అతడిని నమ్మి కోట్లు కుమ్మరిస్తారు. దర్శకులు అతడితో పని చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇక హీరోయిన్లయితే అతడి పక్కన నటించాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అలాంటిది ఓ ముద్దుగుమ్మ సల్మాన్ ని భాయ్ అని సంబోధించి ఆశ్చర్యపరిచింది.
మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఒలీవియా కల్పో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రస్తావన వచ్చింది. ఆమె భవిష్యత్ ప్రణాళికలను గురించి, సినిమాల్లోకి వచ్చే ప్లాన్స్ గురించి అడిగినప్పుడు సల్మాన్ తో నటించాలని ఉంది అని చెప్పింది ఒలీవియా. అయితే సల్మాన్ ఖాన్ అని కాకుండా సల్మాన్ భాయ్ అంది ఒలీవియా. ఇప్పటికే అతడిని కలవడానికి సిద్ధమవుతోందట. అయితే సినిమాల గురించి కాదు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా జరగనున్న ఓ క్యాంపెయిన్లో తనతో పాటు పాల్గొనమని అడగడానికి. త్వరలోనే అతడిని కలుస్తాను అంటూ ఆనందంగా చెప్పింది.

కలుస్తుంది సరే. కానీ ఎవరైనా అతడి పక్కన హీరోయిన్ గా కదా చేయాలని ఆశపడతారు! మరి ఈ సుందరాంగి అన్నయ్య అనేస్తే, ఆమెకు ఆ చాన్స్ ఎలా దక్కుతుంది! ఒకవేళ బాలీవుడ్లో పనిచేసేంత ఆసక్తి లేక అలా అన్నదా అంటే అదీ లేదు. పాపకి హిందీ సినిమాల గురించి ఫుల్ క్లారిటీ ఉంది. చాన్స్ వస్తే చేసేంత ఇంటరెస్ట్ కూడా ఉంది. కానీ పాపం అంత దూరం ఆలోచించి ఉండదు. అయినా మాట మార్చడం ఎంతసేపులెండి. అతడి పక్కన నటిస్తావా అని అడిగి చూడండి... ఎగిరి గంతేస్తుంది. అన్నా అని పిలిచిన విషయం వెంటనే మర్చిపోతుంది. అసలు నేనెప్పుడు అన్నాను అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: