అయిదున్నర అడుగులకు కాస్తా అటూఇటుగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఆరు అడుగులు దాటిన  ప్రభాస్ ను తలదన్నే విదంగా త్వరలో బాహుబలి అవతారం ఎత్త బోతున్నాడట. దీని కోసం ఏకంగా ఫ్లోరిడా నుంచి ఇద్దరు ప్రత్యేక శిక్షకులు ఫిబ్రవరిలోనే ఇక్కడికి వచ్చి ఆ పనిమీదే ఉన్నారంటున్నారు.

ఎన్టీఆర్ ను బాహుబలిగా తయారు చేయడానికి ఇక్కడికి ఫ్లోరిడా నుంచి వచ్చిన జాన్, అంబర్ లు మాట్లాడుతూ తాము బాలీవుడ్ లో ఓ సినిమా వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ ఒప్పందం మేరకు జూనియర్ ను బాహుబలిగా తయారు చేస్తున్నామని చెప్పడం విశేషం.

అదేంటంటే ఎన్టీఆర్ బాలీవుడ్ లో బాద్ షా సినిమా ను తీయబోతున్నాడు. ఈ సినిమా ను తీసేందుకు బాలీవుడ్ లోని పేరుమోసిన బ్యానర్ తోనే ఒప్పందం కూడా కుదిరిందట. ఆ సినిమా కోసం తన సిక్స్ ప్యాక్ చూయించేందుకు బాహుబలి అవతారాన్ని ఎత్త బోతున్నాడు. ఇప్పటికే తన బరువు కంటే రెట్టింపు బరువును ఎత్తుతున్నాడు అంటున్నారు శిక్షకులు జాన్ మరియు అంబర్ లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: