పవర్ స్టార్ అదృష్ట దేవతగా మరో సుందరి వచ్చేసింది. ఇన్నిరోజుల వరకు ఆయన లక్కీ గర్ల్ గా ఉంచుకున్న స్థానాన్ని ఈ కొత్త పిల్ల రీప్లేస్ చేసింది అంటున్నారు టాలీవుడ్ లో. అయితే పాత సుందరి కూడా మళ్లీ ఆ ప్లేస్ కోసం పోటీ పడుతోందట. ఇంతకి ఇద్దరిలో పవన్ పాలిట లక్కీ గర్ల్  లేటెస్టుగా ఎవరు అవుతారంటే కొంత కాలం వెయిటింగ్ తప్పదు.

అయితే ఆ సుందరాంగుల కథేంటో చూద్దాం, గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ పవన్ కు లక్లీ గాళ్ గా మారింది. అయితే తాజాగా ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఆ ప్లేస్ లోకి కొత్త తార ప్రణీత వచ్చి పడింది. ఇప్పుడు తాను తీయబోతున్న ‘గబ్బర్ సింగ్ -2’ లో ఇంకా పవన్ కోసం అదృష్ట సుందరిని సెలెక్ట్ చేయలేదు.

దీని కోసం శృతిహాసన్, ప్రణీతల పేర్లు పరిశీలిస్తున్నారట, అందుకే ఆ లక్కీ గాళ్ ఎవరవుతారా.. అంటూ టాక్ మొదలయింది టాలీవుడ్ లో. పవన్ మితృడు శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత కాగా, సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: